టీమిండియా స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గాయం తిరగబెట్టడంతో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. బుమ్రా లేకపోవడం టీమిండియాకు పెద్ద మైనస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెన్నునొప్పి నుంచి కోలుకొని ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌కు ఎంపికయిన బుమ్రా ఒక్క మ్యాచ్ ఆడాడో లేదో మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టింది. దీంతో దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌తో పాటు టి20 ప్రపంచకప్‌కు కూడా దూరం కావాల్సి వచ్చింది.
ఇక బుమ్రా ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. ఇలా మూడు ఫార్మట్లలో రెగ్యులర్ బౌలర్‌గా కొనసాగడం వల్లే బుమ్రా తరచూ గాయాలపాలవుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జెఫ్ థామ్సన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు వచ్చిన బ్రేక్ బుమ్రా ఆలోచించుకోవాల్సిన సమయం.. మూడు ఫార్మాట్లలో కొనసాగాలా లేక ఏదైనా ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవాలా అనే నిర్ణయంపై అతని భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలిపాడు.
''మూడు ఫార్మాట్లలో ఆడిన బుమ్రా అతడి శరీరానికి శ్రమను కల్పించుకున్నాడు. అందువల్లే తరచూ గాయాల బారీన పడాల్సి వస్తుంది. దీంతో భవిష్యత్తులో ఏం చేయాలని అనుకుంటున్నాడో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత బుమ్రాపై ఉంది. ఆటగాడి కెరీర్‌లో ఒక దశాబ్దం పాటు మాత్రమే అత్యుత్తమ స్థాయిలో బౌలింగ్ చేయగలడు. ఆ తర్వాత నుంచి కెరీర్ ఉత్తమంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి.. సుదీర్ఘకాలం దేశం కోసం సేవ చేయడంలో ఏం సహాయపడుతుందో తెలుసుకోవాలి.
ప్రస్తుతం ఉన్న మూడు ఫార్మాట్లలో బుమ్రా వైట్‌బాల్ క్రికెట్(వన్డే, టి20) ఏంచుకోవడం ఉత్తమం. క్రికెట్ అభిమానులు బుమ్రాను ఎక్కువగా వైట్‌బాల్ క్రికెట్‌లో చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే వైట్‌బాల్ క్రికెట్‌లో తరచుగా ప్రపంచకప్ టోర్నీలు జరుగుతుంటాయి. ఇలా వైట్‌బాల్ క్రికెట్‌లో బుమ్రా టీమిండియా తరపున ఆడి ప్రపంచకప్ అందిస్తే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. అందుకే నా వరకు బుమ్రా వైట్‌బాల్ క్రికెట్ ఆడడం అతనికి నేనిచ్చే సలహా. కానీ బుమ్రా నిర్ణయం అతని వ్యక్తిగతం. బుమ్రాకు ఏం చేయాలని అనిపిస్తే అదే నిర్ణయం తీసుకుంటాడు'' అని పేర్కొన్నాడు.
ఇక బుమ్రా టి20 ప్రపంచకప్‌కు దూరమైనప్పటకి ఆ ప్రభావం టీమిండియాపై అంతగా కనిపించలేదు. బుమ్రా స్థానంలో వచ్చిన షమీ ఆకట్టుకునే బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా, అర్ష్‌దీప్‌లతో పాటు స్పిన్నర్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా అదరగొట్టడం కలిసొచ్చే అంశం. ఇకపై కూడా టీమిండియా బౌలర్లు కలిసికట్టుగా రాణించి టైటిల్ అందించాలని కోరుకుందాం. ఇక పాక్, నెదర్లాండ్స్‌పై వరుస విజయాల ద్వారా టీమిండియా ఆదివారం(అక్టోబర్ 30న) సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సెమీస్ బెర్తు దాదాపు ఖరారు అయినట్లే.
Comments
Please login to add a commentAdd a comment