India vs Australia, 4th Test: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను తిరిగి నియమిస్తే బాగుంటుందని ఆ దేశ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. ప్యాట్ కమిన్స్ స్థానంలో స్మిత్ పూర్తి స్థాయి సారథిగా బాధ్యతలు చేపడితే మంచి ఫలితాలు ఉంటాయన్నాడు. కెప్టెన్లుగా ఉన్న సమయంలో బ్యాటర్లతో పోలిస్తే బౌలర్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతారన్న హాగ్.. ఆసీస్ కెప్టెన్సీ మార్పు ఆవశ్యకమని పేర్కొన్నాడు.
కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌పై నిషేధం పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించిన బోర్డు.. సుదీర్ఘకాలం తర్వాత ఆడటానికి అనుమతినిచ్చింది. అదే విధంగా ప్యాట్ కమిన్స్ డిప్యూటీగా వైస్ కెప్టెన్సీ అవకాశం ఇచ్చింది.
ఈ క్రమంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా మూడో టెస్టులో కమిన్స్ గైర్హాజరీలో స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. గెలుపు కోసం తపించిన ఆసీస్‌కు తన అద్భుత వ్యూహాలతో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఆసీస్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది.
ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ.. ‘‘స్టీవ్ స్మిత్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌ను చేయాలి. ఫాస్ట్‌బౌలర్లకు తరచూ విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో కీలక సభ్యులై ఉంటే రెస్ట్ తప్పనిసరి. ప్యాట్ కమిన్స్‌కు పనిభారం ఎక్కువవుతోంది. నా అభిప్రాయం ప్రకారం బ్యాటర్లు కెప్టెన్లుగా ఉంటే బాగుంటుంది. బౌలర్లపై ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కమిన్స్ ఇప్పటి వరకు కెప్టెన్‌గా మంచి విజయాలు నమోదు చేశాడు. కానీ.. రాను రాను వర్క్‌లోడ్ ఎక్కువైతే తట్టుకోవడం కష్టమే! కాబట్టి స్మిత్‌ను కెప్టెన్ చేస్తే బాగుంటుంది’’ అని తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. టీమిండియాతో మూడో టెస్టులో స్మిత్ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచేలా అమలు చేసిన వ్యూహాలు అద్భుతమని కొనియాడాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి నిర్ణయాత్మక ఆఖరి టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: ఆసీస్‌తో నాలుగో టెస్ట్.. కేఎస్ భరత్‌ను పక్కకు పెట్టొద్దు, కోహ్లి, పుజారా ఏం చేశారని..?
తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్.. మహిళా దినోత్సవం రోజే గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment