బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చెరో గెలుపుతో సమంగా
కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇందుకు ధీటుగా బదులిచ్చిన కంగారూ జట్టు అడిలైడ్‌లో భారత్‌ను పది వికెట్ల తేడాతో ఓడించింది. ఇక ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో తాము షార్ట్ బాల్స్‌తో టీమిండియాను కట్టడి చేశామని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.
అవునా.. నాకైతే తెలియదే!
అడిలైడ్ ఓవల్ మైదానంలో షార్ట్ బాల్ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి.. టీమిండియా బ్యాటర్ల పనిపట్టామని కమిన్స్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని శుబ్‌మన్ గిల్ దగ్గర విలేకరులు ప్రస్తావించగా.. ‘‘అవునా.. నాకైతే తెలియదే!.. షార్ట్ బాల్‌తో బహుశా వాళ్లు ఒక టెయిలెండర్‌ను లేదంటే లోయర్ ఆర్డర్ బ్యాటర్‌ను మాత్రమే అవుట్ చేశారు.
కానీ.. అతడు ఏ షార్ట్‌బాల్‌ను ఉపయోగించి విజయం సాధించామని చెప్తున్నాడో నాకైతే తెలియదు’’ అంటూ కమిన్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా గాయం వల్ల పెర్త్ టెస్టుకు దూరమైన గిల్.. అడిలైడ్‌లో పింక్ బాల్ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.
ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా మిచెల్ స్టార్క్ గిల్‌ను బౌల్డ్ చేశాడు. ఇక మూడో టెస్టు జరుగనున్న బ్రిస్బేన్ స్టేడియంతో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు మధురానుభవం ఉంది.
నాడు 91 పరుగులతో చెలరేగిన గిల్
2021 నాటి టెస్టులో గిల్ 91 పరుగులు చేసిన గిల్.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా గతంలో మాదిరి ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాడు.
మూడో టెస్టునే ఫైనల్ మ్యాచ్‌గా భావించి బరిలోకి దిగుతామన్న గిల్.. గాబాలో గెలిస్తే.. మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడగలమని పేర్కొన్నాడు. కాగా మూడో టెస్టు కోసం ఇప్పటికే బ్రిస్బేన్ చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్లలో తీవ్రంగా శ్రమించింది.
చదవండి: IND vs AUS: మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడు వచ్చేశాడు
Shots fired already? 👀
While @patcummins30 claims Australia have succeeded in their short ball ploy, look what @ShubmanGill has to say about it! 😁😅
1️⃣ DAY TO GO for #AUSvINDOnStar 3rd Test 👉 SAT 14 DEC, 5.20 AM onwards! #ToughestRivalry pic.twitter.com/vS55v5Qgwz— Star Sports (@StarSportsIndia) December 13, 2024
Comments
Please login to add a commentAdd a comment