Australia vs India, 1st Test Day 2 At Perth Updates:
అదరగొట్టిన భారత ఓపెనర్లు.. రెండో రోజు మనదే
పెర్త్ టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో కూడా భారత జట్టు అదరగొట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, రాహుల్ అద్బుతంగా ఆడుతున్నారు. జైశ్వాల్(90), రాహుల్(62) ఆజేయంగా నిలిచారు. ప్రస్తుతం టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ..
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జైశ్వాల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను రాహుల్ ముందుకు నడిపిస్తున్నాడు. క్రీజులో జైశ్వాల్(74), కేఎల్ రాహుల్(56) పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు- 145/0 (37.4). 191 పరుగుల లీడ్.
యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ
ఆసీస్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో మెరిశాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జైస్వాల్‌కు ఇది తొమ్మిదో ఫిఫ్టీ. మరోవైపు రాహుల్ కూడా నిలకడగా ఆడుతున్నాడు.
టీమిండియా స్కోరు- 100/0 (37.4). 146 పరుగుల లీడ్.
టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 84/0 (26)
జైస్వాల్ 42, రాహుల్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా ఆధిక్యం 130 పరుగులు.
20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 75-0
రాహుల్ 29, జైస్వాల్ 38 పరుగులతో ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ప్రస్తుతం 121 పరుగుల మెరుగైన ఆధిక్యంలో ఉంది.
నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు
టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడుతున్నారు. శనివారం నాటి రెండో రోజు ఆటలో 12 ఓవర్లు ముగిసే సరికి రాహుల్ 29 బంతులు ఎదుర్కొని ఎనిమిది, జైస్వాల్ 43 బంతులు ఎదుర్కొని 16 పరుగులు చేశారు. భారత్ స్కోరు: 30-0(12).
ఆస్ట్రేలియా ఆలౌట్.. స్కోరు ఎంతంటే?
టీమిండియాతో తొలి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఆటగాళ్లలో టెయిలెండర్ మిచెల్ స్టార్క్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.
అయితే, స్టార్క్‌ను అవుట్ చేసేందుకు భారత బౌలర్లు సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు హర్షిత్ రాణా అతడిని పెవిలియన్‌కు పంపడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌లో స్టార్క్‌తో పాటు వాళ్లలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు.
ఇక టీమిండియా బౌలర్లలో ప్రధాన పేసర్ బుమ్రాకు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కగా.. హర్షిత్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా తొలి రోజు ఆటలో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్
హర్షిత్ రాణా బౌలింగ్‌లో నాథన్ లియాన్ థర్డ్ స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోగా.. హర్షిత్ ఖాతాలో రెండో వికెట్ జమైంది. జోష్ హాజిల్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. స్టార్క్ 11 పరుగులతో ఉన్నాడు. ఆసీస్ స్కోరు: 79/9 (33.3).
ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టు రెండో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియా అదరగొట్టింది. కెప్టెన్ బుమ్రా బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ(21) అవుటయ్యాడు. పంత్‌కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. దీంతో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. నాథన్ లియాన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 70-8(29).
రెండో రోజు ఆట ఆరంభం
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ఆరంభమైంది. శనివారం 67/7 ఓవర్ నైట్ స్కోరుతో ఆసీస్ తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఆసీస్‌తో శుక్రవారం తొలి టెస్టు మొదలుపెట్టింది. పెర్త్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఆదుకున్న నితీశ్ రెడ్డి, పంత్
టాపార్డర్ కుదేలైన వేళ మిడిలార్డర్ బ్యాటర్ రిషభ్ పంత్(37), లోయర్ ఆర్డర్‌లో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(41) రాణించారు. ఫలితంగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ పేసర్లలో హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. స్టార్క్, కెప్టెన్ కమిన్స్, మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
తొలి రోజు బుమ్రాకు నాలుగు వికెట్లు
ఈ క్రమంలో తొలిరోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్‌కు భారత పేసర్లు చుక్కలు చూపించారు. బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ రెండు, అరంగేట్ర బౌలర్ హర్షిత్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు కాగా.. తొలి రోజు ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి కేవలం 67 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(8), అరంగేట్ర బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ(10), స్టీవ్ స్మిత్(0), ప్యాట్ కమిన్స్(3) వికెట్లను బుమ్రా పడగొట్టగా.. మార్నస్ లబుషేన్(2), మార్ష్(6)ను సిరాజ్ వెనక్కి పంపాడు. హర్షిత్ రాణా ట్రవిస్ హెడ్‌ను అవుట్ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో తన వికెట్ల ఖాతా తెరిచాడు.
తుదిజట్లు
టీమిండియా
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్ స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.
చదవండి: ఇది నా డ్రీమ్ ఇన్నింగ్స్ కాదు.. అతడే నా ఆరాధ్య దైవం: నితీశ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment