Perth test
-
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు
క్రికెట్ ప్రపంచంలో యాషెస్ సిరీస్ తర్వాత అంతే స్థాయిలో అభిమానులను ఆకట్టుకునే రైవలరీ టెస్టు సిరీస్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ). ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకుంటే.. బీజీటీలో టీమిండియాతో తలపడుతుంది. 1996లో మొదలైన ఈ ప్రతిష్టాత్మక సిరీస్.. నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది.బీజీటీలో మనదే పైచేయి.. కానీఇప్పటి వరకు ఈ సిరీస్‌లో టీమిండియాదే పైచేయి. ఇప్పటికి 16 సార్లు జరిగిన బీజీటీలో భారత్ 10 సార్లు ట్రోఫీ కైవసం చేసుకుంది. ఒక్కసారి డ్రాగా ముగియగా.. ఆస్ట్రేలియా ఐదుసార్లు గెలిచింది. ఇక పెర్త్ వేదికగా నవంబరు 22న మరోసారి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ సమరానికి తెరలేవనుంది. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తాడు. మరి ఈ ప్రతిష్టాత్మక సిరీస్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ తదితర విశేషాలు గమనిద్దాం.ఓవరాల్‌గా టెస్టుల్లో టీమిండియా- ఆస్ట్రేలియా ముఖాముఖి రికార్డులుఇప్పటి వరకు తలపడిన 107 మ్యాచ్‌లలో ఇండియా 32, ఆస్ట్రేలియా 45 గెలవగా.. 29 డ్రాగా ముగిశాయి.అత్యధిక పరుగుల, వికెట్ల వీరుడు ఎవరంటే?టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ కొనసాగుతున్నాడు. 39 మ్యాచ్‌లలో అతడు 3630 రన్స్ సాధించాడు. ఇక ఈ భారత్- ఆసీస్ టెస్టు పోరులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్ లయన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు టీమిండియాతో 27 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ స్పిన్నర్ 121 వికెట్లు కూల్చాడు.ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 2024-25షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం👉తొలి టెస్టు👉పెర్త్ స్టేడియం, పెర్త్👉తేదీలు: నవంబర్ 22-26👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ఆరంభం👉రెండో టెస్టు👉ఓవల్ మైదానం, అడిలైడ్(డే, నైట్- పింక్‌బాల్ టెస్టు)👉తేదీలు: డిసెంబరు 6- 10👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు ఆరంభంమూడో టెస్టు👉ది గాబా స్టేడియం, బ్రిస్బేన్👉తేదీలు: డిసెంబరు 14- 18👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5.50 నిమిషాలకు ఆరంభంనాలుగో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు)👉మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్👉తేదీలు: డిసెంబరు 26- 30👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంఐదో టెస్టు👉సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉తేదీలు: జనవరి 3- 7👉సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఆరంభంవార్మప్ మ్యాచ్👉నవంబరు 30- డిసెంబరు 1👉ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ వర్సెస్ ఇండియా-‘ఎ’ మధ్య వార్మప్ మ్యాచ్- మనుకా ఓవల్, కాన్బెర్రా.ఎక్కడ వీక్షించవచ్చు?👉టీవీ బ్రాడ్‌కాస్టర్: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్👉లైవ్ స్ట్రీమింగ్: డిస్నీ+హాట్స్టార్జట్లుఆస్ట్రేలియాతో ఐదు టెస్టులకు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్,ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.ట్రావెలింగ్ రిజర్వ్స్: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్టీమిండియాతో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్‌న్యూస్?! -
ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరం: టీమిండియా కోచ్
యువ క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డిపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్రశంసలు కురిపించాడు. నితీశ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలు అద్భుతమని.. అతడి చేరికతో జట్టు మరింత వైవిధ్యంగా మారిందని కొనియాడాడు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఈ పేస్ ఆల్‌రౌండర్ సేవలను ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాల్సి ఉందని పేర్కొన్నాడు. తద్వారా ఆస్ట్రేలియాతో టెస్టులో నితీశ్ అరంగేట్రం ఖాయమని పరోక్షంగా వెల్లడించాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కమిన్స్ బృందంతో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే, పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియాను ముందుకు నడిపించనున్నాడు.ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరంఇక ఇరుజట్ల మధ్య శుక్రవారం(నవంబరు 22) ఈ మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా విశాఖ కుర్రాడు నితీశ్ రెడ్డి ప్రస్తావన రాగా.. ‘‘జట్టులో ఇప్పుడున్న యువ ఆటగాళ్లలో నితీశ్ రెడ్డి స్కిల్ అద్భుతం. ముఖ్యంగా మ్యాచ్ మొదటి రెండు రోజుల ఆటలో అతడు కీలకం కానున్నాడు.వికెట్-టు- వికెట్ బౌలింగ్ వేయగల సత్తా నితీశ్ సొంతం. ప్రపంచంలోని ప్రతీ క్రికెట్ జట్లూ పేసర్లకు సహాయపడగల ఆల్‌రౌండర్‌ను కోరుకుంటుంది. అయితే, జస్ప్రీత్ నితీశ్ సేవలను ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాలి. ఈ సిరీస్‌లో అందరినీ ఆకర్షించగల ఆటగాడు అనడంలో సందేహం లేదు’’ అని నితీశ్ రెడ్డిని మోర్కెల్ ప్రశంసించాడు.కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ తరఫున సత్తా చాటి.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ఆసీస్‌తో పర్యటనలో టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదనపు బలం అదేఇప్పటికే పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్‌ల వంటి సీనియర్లతో పాటు ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా ఉన్నా.. బ్యాటింగ్ కూడా చేయడం నితీశ్‌కు ఉన్న అదనపు బలం. కాబట్టి బుమ్రా, సిరాజ్‌లతో పాటు 21 ఏళ్ల ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను తుదిజట్టులో ఆడించేందుకు మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన టీమిండియా..రోహిత్ శర్మ (కెప్టెన్)జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)యశస్వి జైస్వాల్అభిమన్యు ఈశ్వరన్శుభ్మన్ గిల్విరాట్ కోహ్లీకేఎల్ రాహుల్రిషభ్ పంత్ (వికెట్ కీపర్)సర్ఫరాజ్ ఖాన్ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్)రవిచంద్రన్ అశ్విన్రవీంద్ర జడేజామహ్మద్ సిరాజ్ఆకాశ్ దీప్ప్రసిద్ కృష్ణహర్షిత్ రాణానితీశ్ కుమార్ రెడ్డివాషింగ్టన్ సుందర్. చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
నేనే గనుక రోహిత్ స్థానంలో ఉండి ఉంటే..: గంగూలీ
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాకు చేరుకోవాలని సూచించాడు. జట్టుకు నాయకుడి అవసరం ఉందని.. ముఖ్యంగా ఇలాంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో కెప్టెన్ తోడుగా ఉంటే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందన్నాడు.ఒకవేళ తాను గనుక రోహిత్ స్థానంలో ఉంటే కచ్చితంగా ఆస్ట్రేలియాకు వెళ్లేవాడినని పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో తలపడనుంది. ఇందులో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది. కనీసం నాలుగు మ్యాచ్లైనాఇక కివీస్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్ కావడంతో.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే ఆసీస్‌తో కనీసం నాలుగు మ్యాచ్‌లైనా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా.. నవంబరు 22 నుంచి పెర్త్ వేదికగా ఆసీస్- టీమిండియా మధ్య ఈ సిరీస్ మొదలుకానుంది. పండంటి మగబిడ్డఅయితే, కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఇప్పటికే భారత ఆటగాళ్లంతా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి.. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. కాగా రోహిత్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు దూరం కానున్నాడనే వార్తలు వచ్చాయి. అతడి భార్య రితికా సజ్దే తమ రెండో సంతానానికి జన్మనిచ్చే క్రమంలో.. భార్య ప్రసవం కోసం రోహిత్ ముంబైలోనే ఉంటాడని ప్రచారం జరిగింది.అందుకు తగ్గట్లుగానే రితికా శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు రోహిత్ శర్మ ధ్రువీకరించాడు. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ త్వరలోనే ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని భావిస్తున్నా. ఎందుకంటే.. జట్టుకు ఇప్పుడు నాయకుడి అవసరం ఎంతగానో ఉంది.నేనే గనుక అతడి స్థానంలో ఉంటే.. అతడి భార్య శుక్రవారం రాత్రే మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసింది. కాబట్టి.. రోహిత్ ఇక ఆస్ట్రేలియాకు బయల్దేరవచ్చు. నేనే గనుక అతడి స్థానంలో ఉంటే.. ఇప్పటికే ఆసీస్‌కు పయనమయ్యేవాడిని.తొలి టెస్టు ఆరంభానికి ముందు ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఇదొక ప్రతిష్టాత్మక సిరీస్. రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్లడం అత్యంత ముఖ్యం. జట్టుకు అతడి అవసరం ఉంది’’ అని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ తొలి టెస్టు ఆడితేనే బాగుంటుందని గంగూలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.చదవండి: చరిత్రపుటల్లోకెక్కిన మ్యాక్స్‌వెల్.. అత్యంత వేగంగా..! -
ధృవ్ జురెల్ మరో హాఫ్ సెంచరీ.. 229 పరుగులకు భారత్ ఆలౌట్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న రెండో ఆనాధికరిక టెస్టులో భారత-ఎ జట్టును వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ మరోసారి ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా జురెల్ హాఫ్ సెంచరీ సాధించాడు. తన అద్బుత ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఫైటింగ్ స్కోర్‌ను అందించాడు.122 బంతులు ఎదుర్కొన్న జురెల్ 5 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. అతడితో పాటు తనీష్ కొటియన్(44), నితీష్ కుమార్ రెడ్డి(38) పరుగులతో రాణించారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 229 పరుగులకు ఆలౌటైంది. 75/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత-ఎ జట్టు అదనంగా 154 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.దీంతో ఆస్ట్రేలియా ముందు 168 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు.భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు.. ఇక రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీలతో రాణించిన ధృవ్ జురెల్‌ను పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టులో ఆడించాలని భారత జట్టు మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు వేసి జురెల్‌కు చోటు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పరిస్థితులకు తగ్గట్టు ఆడుతున్న జురెల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
అతడు ప్రపంచంలోనే చెత్త కీపర్!
పెర్త్: ఆస్ట్రేలియా టెస్టు సారథి, వికెట్ కీపర్ టిమ్ పైన్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు వరుస కామెంట్స్ చేస్తున్నారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో పైన్ చేసిన చిన్న తప్పిదానికి అతడిపై ఆసీస్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. తొలి టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా టిమ్ పైన్ చెత్త కీపంగ్‌తో కివీస్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కివీస్ బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మిచెల్ స్టార్ వేసిన 35వ ఓవర్ ఐదో బంతిని రాస్ టేలర్ కవర్ పాయింట్ దిశగా తరలించి సింగిల్ తీశాడు. అయితే నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న వాట్లింగ్, టేలర్ వద్దని వారించినా రెండో పరుగు కోసం సగం క్రీజు వరుకు చేరుకున్నాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న నాథన్ లియోన్ బంతిని వేగంగా అందుకొని వికెట్ కీపర్ చేతుల్లోకి విసిరిడు. ఆ సులువైన బంతిని అందుకోవడంలో పైన్ విఫలమయ్యాడు. దీంతో వాట్లింగ్‌కు పైన్ రూపంలో జీవనధారం లభించింది. సులువైన బంతిని అందుకోడంలో విఫలమైన టిమ్ పైన్ సిగ్గుతో తలదించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ రనౌట్ మిస్సయినప్పటికీ ఆసీస్‌కు వచ్చిన పెద్ద నష్టమేమి లేదు. ఎందుకంటే వాట్లింగ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 8 పరుగులకే ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే చాలా సులువైన బంతిని అందుకోవడంలోనే పైన్ తడబడటంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ‘అసలు పైన్ జట్టులో ఎందుకో నాకర్థం కావడం లేదు. కీపింగ్‌లో ఎలాంటి గొప్పతనం, కొత్తదనం లేదు.. ఇక బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కేవలం కెప్టెన్‌గా ఉన్నందునే జట్టులో ఇంకా కొనసాగుతున్నాడు. యువ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి అవకాశం ఇచ్చి.. స్మిత్‌కు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి టిమ్ పైన్‌ను జట్టు నుంచి సాగనంపడం బెటర్’అంటూ ఓ నెటజన్ కామెంట్ చేయగా.. ‘ప్రపంచంలోనే చెత్త కీపర్ టిమ్ పైన్’ అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్ ఎదురీదుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కులు చూపించారు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది. 250 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ ధాటిగా ఆడటంతో 217 పరుగులకే ఆలౌటైంది.(గాయం కారణంగా హేజిల్‌వుడ్ బ్యాటింగ్‌కు దిగలేదు). దీంతో కివీస్ ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చదవండి: ఒకే టెస్టులో ఏకంగా ముగ్గురు.. ‘గుర్తుపెట్టుకోండి.. అతడే మ్యాచ్ డిసైడర్’ An early chance goes by! Paine fumbles with Watling out of the frame! #AUSvNZ live: https://t.co/0Uay6Vh9fg pic.twitter.com/mjZUiWrrqH — cricket.com.au (@cricketcomau) December 14, 2019 -
పెర్త్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం
ఎలాంటి పోరాటం లేదు. ప్రత్యర్థిని కొద్ది సేపయినా నిరోధించగల పట్టుదల కనిపించలేదు. ఊహించినట్లుగానే టెయిలెండర్ల నుంచి ఏమాత్రం ప్రతిఘటన ఎదురు కాలేదు. ఫలితంగా పెర్త్ టెస్టులో భారత్ పరాజయానికి మంగళవారం 65 నిమిషాలు సరిపోయాయి. సంయుక్తంగా 10 టెస్టుల అనుభవం కూడా లేని విహారి, పంత్‌లు ఎలాంటి ప్రత్యేక ప్రదర్శనను ఇవ్వలేకపోగా, ఆస్ట్రేలియా భారీ విజయంతో సిరీస్‌ను సమం చేసి పోటీలో నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ ఏడాది విదేశీ గడ్డపై 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చిన ఐదు సార్లూ పరాజయం చవిచూసిన కోహ్లి సేన ఖాతాలో అలాంటిదే మరో ఓటమి చేరింది. సరిగ్గా వారం విరామం తర్వాత ఈనెల 26న మొదలయ్యే ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఇరు జట్లు మళ్లీ బలపరీక్షకు సిద్ధం కానున్నాయి. పెర్త్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో లాంఛనం ముగిసింది. మ్యాచ్ చివరి రోజు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1–1తో సమంగా నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 112/5తో ఆట కొనసాగించిన టీమిండియా ఇన్నింగ్స్ ముగిసేందుకు 15 ఓవర్లు మాత్రమే పట్టాయి. రిషభ్ పంత్ (61 బంతుల్లో 30; 2 ఫోర్లు), హనుమ విహారి (75 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఔటైన తర్వాత చివరి నలుగురు భారత బ్యాట్స్‌మెన్ కలిపి 2 పరుగులు మాత్రమే చేయగలిగారు. టెస్టులో ఎనిమిది కీలక వికెట్లతో సత్తా చాటిన ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లయన్ (8/106) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత ఆస్ట్రేలియాకు ఇది మొదటి విజయం కాగా... కెప్టెన్‌గా పైన్‌కు కూడా ఇదే మొదటి గెలుపు కావడం విశేషం. మూడో టెస్టు ఈ నెల 26 నుంచి మెల్బోర్న్లో జరుగుతుంది. టపటపా... ఐదో రోజు ఆటను విహారి, పంత్ జాగ్రత్తగా ఆరంభించారు. ముఖ్యంగా స్టార్క్‌ను విహారి సమర్థంగా ఎదుర్కొన్నాడు. అయితే స్టార్క్ బౌలింగ్‌లోనే విహారి లెగ్‌సైడ్ ఆడబోగా అనూహ్యంగా లేచిన బంతి మిడ్ వికెట్ ఫీల్డర్ చేతుల్లో పడింది. కొద్దిసేపటి తర్వాత లయన్ బౌలింగ్‌లో పంత్ ముందుకు దూసుకొచ్చి భారీ షాట్ ఆడబోగా విహారి తరహాలోనే మిడ్ వికెట్ వద్దే బంతి లేచింది. హ్యాండ్స్కోంబ్ ఎడమవైపు అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్‌ను అందుకోవడంతో భారత్ ఆట దాదాపుగా ముగిసింది. 23 బంతులు ఆడిన ఉమేశ్ (2)ను స్టార్క్ పెవిలియన్ పంపించగా...తర్వాతి ఓవర్ వేసిన కమిన్స్ నాలుగు బంతుల వ్యవధిలో ఇషాంత్ (0), బుమ్రా (0)లను ఔట్ చేసి ఆసీస్‌ను గెలిపించాడు. స్వదేశానికి రోహిత్ శర్మ! గాయంతో రెండో టెస్టు ఆడని భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ మెల్బోర్న్ టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని భార్య రితిక సజ్దే ఈ వారంలో తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. దాంతో రోహిత్ స్వదేశానికి పయనమవుతున్నాడు. అతను మూడో టెస్టులోగా తిరిగి ఆస్ట్రేలియా వెళతాడా లేదా అనేది సందేహమే. మరోవైపు తర్వాతి రెండు టెస్టుల కోసం ఎలాంటి మార్పులు లేకుండా ఆసీస్ తమ జట్టును ప్రకటించింది. -
ఇషాంత్–జడేజా వాగ్యుద్ధం
మైదానంలో ఒకవైపు భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య చిటపటలు కొనసాగుతుంటే ఇది సరిపోదన్నట్లుగా ఇద్దరు టీమిండియా సహచరులే గొడవకు దిగారు. ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా తీవ్రంగా వాదులాడుకున్న దృశ్యాలను సిరీస్ ప్రసారకర్త ‘చానల్ 7’ బయటపెట్టింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ బ్యాటింగ్ సమయంలో షమీ వేసిన బంతి హెల్మెట్‌కు తగలడంతో లయన్ చికిత్స తీసుకున్నాడు. ఆ విరామంలో ఇషాంత్, జడేజా ఒకరి వైపు మరొకరు దూసుకొచ్చి తీవ్రంగా వాదించుకున్నారు. సరిగ్గా కారణం తెలియకపోయినా స్టంప్స్ మైక్‌లు రికార్డయిన మాటలను బట్టి చూస్తే ఇద్దరూ హిందీలో బూతులు తిట్టుకున్నారు. ఒకరి వైపు మరొకరు పదే పదే వేలు చూపించడం, హావభావాలు చూస్తే ఘాటుగానే గొడవ జరిగినట్లు కనిపించింది. చివరకు షమీ, కుల్దీప్ యాదవ్ జోక్యం చేసుకొని వీరిద్దరిని అడ్డుకున్నారు. అయితే ఈ ఘటన ఆధారంగా భారత ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయని వచ్చిన వార్తలను బీసీసీఐ ఖండించింది. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని, జట్టులో అంతా బాగుందని బోర్డు స్పష్టం చేసింది. -
నా సెంచరీ గురించి మాట్లాడటం వృథా : కోహ్లి
పెర్త్ : ఓటమి తర్వాత వ్యక్తిగత ప్రదర్శనల గురించి మాట్లాడటం అనవసరమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 146 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘జట్టుగా మేం బాగానే ఆడాం. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాకంటే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ పిచ్‌పై 330 పరుగులు చాలా ఎక్కువ. వారు విజయానికి అర్హులు. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. పిచ్‌ను పరిశీలించినప్పుడు మాకు జడేజా గుర్తుకు రాలేదు. ఆ సమయంలో నలుగురు పేసర్లు చాలు అనుకున్నాం. కానీ నాథన్ అద్భుతంగా రాణించాడు. ఓడినప్పుడు వ్యక్తిగత ప్రదర్శనల గురించి ప్రస్తావించడం అసంబద్ధం. నా వికెట్ విషయంలో అంపైర్ నిర్ణయంపై కూడా స్పందించడం వృథా. అది మైదానంలో జరిగింది. అక్కడే వదిలేయాలి. ప్రస్తుతం నా దృష్టంతా తదుపరి మ్యాచ్‌పైనే.’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ఇక ఈ విజయంపై ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ సంతోషం వ్యక్తం చేశాడు. తమ ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతోనే ఇది సాధ్యమైందన్నాడు. నాథన్ లయన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, ప్రతీ జట్టు ఇలాంటి స్పిన్నర్‌ను కోరుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఇది చాలా కఠినమైన మ్యాచ్ అని, ఇరు జట్లు మంచి పేస్‌బలగంతో పోటీ పడ్డాయన్నాడు. ఈ విజయం పట్ల గర్వంగా ఉందని, ఉస్మాన్ ఖాజా చాలా సేపు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. ఇక బాల్ ట్యాంపరింగ్ ఘటన అనంతరం ఆసీస్ టెస్ట్‌ల్లో తొలి విజయాన్ని నమోదు చేయడం గమనార్హం. చదవండి: కోహ్లిసేన ఓటమికి కారణాలివేనా? -
కోహ్లిసేన ఓటమికి కారణాలివేనా?
పెర్త్ : ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌ను ఘనంగా ప్రారంభించిన భారత్.. రెండో టెస్ట్‌లో చతికిలపడింది. తొలి టెస్ట్ విజయంతో సిరీస్‌లో ఆధిక్యం సాధించిన కోహ్లి సేన.. అదే ఊపును కొనసాగిస్తుందని అందరూ భావించారు. తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించి విజయాన్నందుకున్న టీమిండియా రెండో టెస్ట్‌లో స్వియ తప్పిదాలతో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. జట్టు కూర్పు, ఓపెనర్ల విఫలం, తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయం భారత విజయవకాశాలను దెబ్బతీశాయి. స్పిన్నర్ లేకపోవడం.. తొలి టెస్ట్‌లో రాణించిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయంతో సెకండ్ మ్యాచ్‌కు దూరం కాగా.. అతని స్థానంలో మరో స్పిన్నర్ రవీంద్ర జడేజాను తీసుకోకుండా కోహ్లి పెద్ద తప్పు చేశాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, చివరకు జట్టులోని ఆటగాళ్లు కూడా అభిప్రాయపడుతున్నారు. పిచ్‌ను అంచనా వేసే విషయంలో కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలు పప్పులో కాలేశారు. పేస్‌కు అనుకూలిస్తుందని భ్రమపడి నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగారు. ఇది భారత్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ విషయం ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయాన్ 8 వికెట్లతో చెలరేగడంతో స్పష్టమైంది. ఇక ఒక్క బౌలింగ్‌లోనే కాదు.. అటు బ్యాటింగ్‌లోని పెద్ద దెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ అనంతరం ఈ విషయం సుస్పష్టమైంది. కోహ్లి వికెట్ అనంతరం అందరూ బౌలర్లే కావడంతో వికెట్ కీపర్ రిషభ్ పంత్ దాటిగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ స్థానంలో జడేజా.. పంత్‌కు తోడుగా ఉండి ఉంటే మరో మంచి భాగస్వామ్యంతో భారత్‌కు స్పల్ప ఆధిక్యమన్నా లభించేది. అప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. భారత ఓటమి అనంతరం టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విషయాన్నే చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో 6 వికెట్లతో చెలరేగిన మహ్మద్ షమీ సైతం ఒక స్పిన్నర్ ఉంటే బాగుండూ అని అభిప్రాయపడ్డాడు. కొంపముంచిన అంపైర్ నిర్ణయం.. భారత తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ విషయంలో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం కూడా భారత్ కొంపముంచింది. హ్యాండ్స్కోంబ్ పట్టిన క్యాచ్‌తో వివాదాస్పద రీతిలో పెవిలియన్ చేరిన కోహ్లి అప్పటికే అద్భుత సెంచరీతో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. జట్టు స్కోర్ 251 పరుగుల వద్ద కోహ్లి(123) ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ అనంతరం మరో 32 పరుగుల్లోపే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఆతిథ్య జట్టు 43 పరుగులు ఆధిక్యం లభించింది. కోహ్లి మరికొద్ది సేపు ఉంటే.. పంత్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉండేది. భారీ ఆధిక్యం సాధించకపోయినా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై పైచేయి సాధించేది. ఇది ఇరు జట్ల సెకండ్ ఇన్నింగ్స్‌లపై ప్రభావం చూపేది. ఓపెనర్ల విఫలం.. ఈ సిరీస్‌లో ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌లు దారుణంగా విఫలమవుతుండటం భారత బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాట్స్‌మెన్ తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. అంతేకాకుండా ప్రత్యిర్థి బౌలర్లకు బలంగా మారుతోంది. ఈ ప్రభావం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 2 పరుగులు చేయగా.. మురళీ విజయ్ డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ డకౌట్ కాగా.. మురళి విజయ్ కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో చతేశ్వరా పుజారా(24, 4) దారుణంగా విఫలమయ్యాడు. ఇక కోహ్లి ఔట్ అయిన అనంతరం మ్యాచ్ చేజారినట్లు ఇతర ఆటగాళ్లు భావించడం కూడా భారత్‌కు ప్రతికూలంగా మారుతోంది. ఈ విషయం చివరి రోజు ఆటతో స్పష్టమైంది. కనీస పోరాట పటిమ ప్రదర్శించకుండా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. విహారి, పంత్‌లు వారికి దక్కిన చక్కని అవకాశాలను ఉపయోగించుకోవడం లేదు. అంతా కోహ్లిపైనే ఆధారపడటం కూడా భారత్‌కు అంతమంచిది కాదు. -
భారత్ ఘోర పరాజయం
-
పెర్త్ టెస్ట్: భారత్ ఘోర పరాజయం!
పెర్త్ : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ ఘోర పరాజాయాన్ని మూటగట్టుకుంది. తొలి టెస్టులోనే విజయం సాధించి కొత్తగా కనిపించిన భారత జట్టు మళ్లీ పాత దారిలోకే వచ్చేసింది. 287 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్.. 140 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్ దారుణంగా విఫలమవడంతో మిడిలార్డర్, లోయరార్డర్ సైతం చేతులెత్తేసింది. రహానే (30), పంత్ (30), విహారి (28), విజయ్ (20), కోహ్లి(17)లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నాలుగో రోజు కోహ్లి ఔటైన క్షణమే మ్యాచ్‌పై భారత్ ఆశలు ఆవిరయ్యాయి. అయినప్పటికి ఇంత దారుణంగా ఓడుతుందని ఎవరూ ఊహించలేదు. 112/5 ఓవర్ నైట్‌స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 28 పరుగులు జోడించి చేతులెత్తేసింది. స్టార్క్, లయన్లు మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఉమేశ్ యాదవ్(2), ఇషాంత్ శర్మ(0), బుమ్రా(0)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆసీస్ 146 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని 4 టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆస్ట్రేలియా తొన్ని ఇన్నింగ్స్ 326 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 243 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్ 283 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 140 ఆలౌట్ -
అంపైర్ తప్పుడు నిర్ణయం.. కోహ్లి ఔట్!
పెర్త్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వివాదాస్పద రీతిలో పెవిలియన్ చేరాడు. కమిన్స్ వేసిన 93వ ఓవర్ చివరి బంతి కోహ్లి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకండ్ స్లిప్‌లో ఉన్న హ్యాండ్స్కోంబ్ చేతిలో పడింది. అయితే బంతి నేలకు తాకినట్లుగా అనిపించడంతో ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్‌ను సమీక్ష కోరారు. క్లిష్టతరమైన ఈ కాల్‌ను పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే బంతి మాత్రం నేలకు తాకిన సమయంలోనే ఫీల్డర్ చేతిలో పడినట్లు రిప్లేలో కనబడింది. ఇటువంటి పరిస్థితుల్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్‌గా బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా ఇవ్వాల్సి ఉన్నప్పటికి థర్డ్ అంపైర్ ఔటివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయంపై కోహ్లి కూడా అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఇక అనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మద్ షమీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో లంచ్ విరామానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఆసీస్ కన్నా భారత్ 74 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో రిషబ్ పంత్ (14) ఉన్నాడు. OUT or NOT OUT? King #Kohli departs for a magnificent 123. #AUSvIND https://t.co/oAKdXyg0yK pic.twitter.com/bdo6HQT9WX — Telegraph Sport (@telegraph_sport) December 16, 2018 చదవండి: కోహ్లి మరో రికార్డు! -
హమ్మయ్య.. ఆసీస్‌ను పడగొట్టారు!
పెర్త్ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 326 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన ఆతిథ్య జట్టు.. రెండో రోజు ఆటలో మాత్రం చతికిలపడింది. 277/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్‌మన్.. నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్‌ను 300 దాటించారు. ఈ తరుణంలో భారత పేసర్లు ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లు విజృంభించడంతో మరో 26 పరుగులు జోడించి చాపచుట్టేసింది. కెప్టెన్ టిమ్ పైన్ 38(88 బంతులు, 5 ఫోర్లు), ప్యాట్‌కమిన్స్ 19(66 బంతులు)లు జాగ్రత్తగా ఆడేప్రయత్నం చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని ఉమేశ్ యాదవ్ చక్కటి బంతితో విడదీశాడు. కమిన్స్‌ను బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. దీంతో 7 వికెట్‌కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే బుమ్రా టిమ్ పైన్‌ను ఔట్ చేయడం.. మిగిలిన రెండు వికెట్లు స్కార్క్ (6), హజల్‌వుడ్ (0)లను ఇషాంత్ తన ఖాతాలో వెసుకోవడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో ఇషాంత్‌శర్మకు నాలుగు వికెట్లు పడగా.. బుమ్రా, ఉమేశ్ యాదవ్, విహారిలకు రెండేసి వికెట్లు దక్కాయి. -
ఆసీస్ బౌలర్ల ధాటికి సఫారీలు విలవిల
పెర్త్: దక్షిణాఫ్రికా చేతిలో వన్డే సిరీస్‌లో 5-0తో దారుణ ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా టెస్టుల్లో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. నేడు పెర్త్ లో ఇరు జట్ల మధ్య ప్రారంభమైన తొలి టెస్టులో ఆసీస్ పేసర్లు చెలరేగిపోతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలకు ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. 32 పరుగులకే సఫారీ జట్టు టపార్డర్ ను పెవిలియన్ బాట పట్టించి, ఆ జట్టును ఆత్మరక్షణలోకి నెట్టేశారు. బ్యాటింగ్ కు దిగిన సఫారీ జట్టు ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఖాతా తెరవకుండానే ఓపెనర్ కుక్ వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన ఆసీస్ పేసర్ స్టార్క్ ఆ ఓవర్ నాలుగో బంతికి కుక్(0) ను ఔట్ చేశాడు. మరో పేసర్ హజెల్ వుడ్ స్టార్ బ్యాట్స్ మన్ హషీం ఆమ్లా(0)ను తెలివైన బంతితో బోల్తా కొట్టించగా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. అదే జోరులో సఫారీ ఓపెనర్ ఎల్గర్(12)ను మూడో వికెట్ రూపంలో పెవిలియన్ బాట పట్టించాడు. దాదాపు 9 నెలల తర్వాత గాయాల నుంచి కోలుకుని జట్టులోకొచ్చిన ఆసీస్ పేసర్ సిడిల్ కూడా ఆసీస్ కు బ్రేక్ ఇచ్చాడు. సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన జేపీ డుమిని(11) సిడిల్ బౌలింగ్ లో కీపర్ నెవిల్ కు క్యాచ్ ఇచ్చి జట్టు స్కోరు 32 పరుగుల వద్ద నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. పేసర్లకు అనుకూలించే పెర్త్ పిచ్ పై ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు మరింత చెలరేగితే సఫారీలకు కష్టాలు తప్పవు.