పెర్త్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వివాదాస్పద రీతిలో పెవిలియన్ చేరాడు. కమిన్స్ వేసిన 93వ ఓవర్ చివరి బంతి కోహ్లి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకండ్ స్లిప్‌లో ఉన్న హ్యాండ్స్‌కోంబ్ చేతిలో పడింది. అయితే బంతి నేలకు తాకినట్లుగా అనిపించడంతో ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్‌ను సమీక్ష కోరారు. క్లిష్టతరమైన ఈ కాల్‌ను పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే బంతి మాత్రం నేలకు తాకిన సమయంలోనే ఫీల్డర్ చేతిలో పడినట్లు రిప్లేలో కనబడింది.
ఇటువంటి పరిస్థితుల్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్‌గా బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా ఇవ్వాల్సి ఉన్నప్పటికి థర్డ్ అంపైర్ ఔటివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయంపై కోహ్లి కూడా అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఇక అనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మద్ షమీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో లంచ్ విరామానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఆసీస్ కన్నా భారత్ 74 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో రిషబ్ పంత్ (14) ఉన్నాడు.
OUT or NOT OUT? King #Kohli departs for a magnificent 123. #AUSvIND https://t.co/oAKdXyg0yK pic.twitter.com/bdo6HQT9WX
— Telegraph Sport (@telegraph_sport) December 16, 2018
Comments
Please login to add a commentAdd a comment