మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న రెండో ఆనాధికరిక టెస్టులో భారత-ఎ జట్టును వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ మరోసారి ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా జురెల్ హాఫ్ సెంచరీ సాధించాడు. తన అద్బుత ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఫైటింగ్ స్కోర్‌ను అందించాడు.
122 బంతులు ఎదుర్కొన్న జురెల్ 5 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. అతడితో పాటు తనీష్ కొటియన్(44), నితీష్ కుమార్ రెడ్డి(38) పరుగులతో రాణించారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 229 పరుగులకు ఆలౌటైంది. 75/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత-ఎ జట్టు అదనంగా 154 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.
దీంతో ఆస్ట్రేలియా ముందు 168 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు.
భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు..
ఇక రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీలతో రాణించిన ధృవ్ జురెల్‌ను పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టులో ఆడించాలని భారత జట్టు మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు వేసి జురెల్‌కు చోటు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పరిస్థితులకు తగ్గట్టు ఆడుతున్న జురెల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment