పెర్త్ : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ ఘోర పరాజాయాన్ని మూటగట్టుకుంది. తొలి టెస్టులోనే విజయం సాధించి కొత్తగా కనిపించిన భారత జట్టు మళ్లీ పాత దారిలోకే వచ్చేసింది. 287 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్.. 140 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్ దారుణంగా విఫలమవడంతో మిడిలార్డర్, లోయరార్డర్ సైతం చేతులెత్తేసింది. రహానే (30), పంత్ (30), విహారి (28), విజయ్ (20), కోహ్లి(17)లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
నాలుగో రోజు కోహ్లి ఔటైన క్షణమే మ్యాచ్‌పై భారత్ ఆశలు ఆవిరయ్యాయి. అయినప్పటికి ఇంత దారుణంగా ఓడుతుందని ఎవరూ ఊహించలేదు. 112/5 ఓవర్ నైట్‌స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 28 పరుగులు జోడించి చేతులెత్తేసింది. స్టార్క్, లయన్‌లు మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఉమేశ్ యాదవ్(2), ఇషాంత్ శర్మ(0), బుమ్రా(0)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆసీస్ 146 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని 4 టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
ఆస్ట్రేలియా తొన్ని ఇన్నింగ్స్ 326 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 243 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 283 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 140 ఆలౌట్
Comments
Please login to add a commentAdd a comment