క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఆరంభానికి సమయం అసన్నమైంది. శుక్రవారం(నవంబర్ 22) పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ మొదలుకానుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. పటిష్టమైన ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై దెబ్బ కొట్టాలంటే భారత్ కచ్చితంగా అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయ్యి ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు.. కంగారుల దూకుడుకు ఎలా అడ్డుకుంటుందోనని అభిమానులు అతృతగా ఎదుచూస్తున్నారు.
ముఖ్యంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్ కీలకం. ఈ సిరీస్‌లో 4-0 తేడాతో ఆసీస్‌ను ఓడిస్తేనే భారత్ నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అవుతోంది. ఇక తొలి టెస్టు జరిగే పెర్త్‌లో భారత్ రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
ఆసీస్‌దే పై చేయి..?
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో టీమిండియాకు పేలవ రికార్డు ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టులు జరిగాయి. అందులో టీమిండియా కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా.. ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చివరగా భారత్ 2018 పర్యటనలో ఈ స్టేడియంలో టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 146 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది.
బ్యాటింగ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?
ఈ ఆప్టస్ స్టేడియంలో టీమిండియా సాధించిన అత్యధిక స్కోర్ 402 పరుగులు. 1977లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు నమోదు చేసింది. ఈ వేదికలో భారత్ అత్యల్ప స్కోర్ 141 పరుగులగా ఉంది. 2018లో ఆసీస్‌తో జరిగిన టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 141 పరుగులకు మెన్ ఇన్ బ్లూ ఆలౌటైంది.
విరాట్ ఒక్కడే..
ఈ వేదికలో భారత్ నుంచి విరాట్ కోహ్లికి ఒక్కడికే మంచి రికార్డు ఉంది. పెర్త్‌లో ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన కోహ్లి.. 259 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా సునీల్ గవాస్కర్(127 పరుగులు, 1977లో) ఉన్నారు. అదేవిధంగా ఈ వేదికలో అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో భారత్ నుంచి దిగ్గజం బిషన్ సింగ్ బేడీ(10 వికెట్లు) అగ్రస్ధానంలో ఉన్నారు.
చదవండి: విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు
Comments
Please login to add a commentAdd a comment