
పెర్త్ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 326 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన ఆతిథ్య జట్టు.. రెండో రోజు ఆటలో మాత్రం చతికిలపడింది. 277/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్‌మన్.. నిలకడగా ఆడుతూ జట్టు స్కోర్‌ను 300 దాటించారు. ఈ తరుణంలో భారత పేసర్లు ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లు విజృంభించడంతో మరో 26 పరుగులు జోడించి చాపచుట్టేసింది. కెప్టెన్ టిమ్ పైన్ 38(88 బంతులు, 5 ఫోర్లు), ప్యాట్‌కమిన్స్ 19(66 బంతులు)లు జాగ్రత్తగా ఆడేప్రయత్నం చేశారు.
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని ఉమేశ్ యాదవ్ చక్కటి బంతితో విడదీశాడు. కమిన్స్‌ను బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. దీంతో 7 వికెట్‌కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే బుమ్రా టిమ్ పైన్‌ను ఔట్ చేయడం.. మిగిలిన రెండు వికెట్లు స్కార్క్ (6), హజల్‌వుడ్ (0)లను ఇషాంత్ తన ఖాతాలో వెసుకోవడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో ఇషాంత్‌శర్మకు నాలుగు వికెట్లు పడగా.. బుమ్రా, ఉమేశ్ యాదవ్, విహారిలకు రెండేసి వికెట్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment