టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను మరికొన్నాళ్లపాటు బెంచ్‌కే పరిమితం చేయాలని భారత జట్టు యాజమాన్యానికి సూచించాడు. యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.
గాయం వల్ల జట్టుకు దూరం
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉండగా.. టెస్టుల్లో వన్‌డౌన్‌లో ఆడుతున్న గిల్ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.
రిషభ్ పంత్ ఉన్నప్పటికీ
ఈ నేపథ్యంలో రోహిత్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. మరోవైపు.. గిల్ లేకపోవడంతో.. రిషభ్ పంత్ ఉన్నప్పటికీ మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ, గిల్ అందుబాటులోకి రావడంతో ఎవరిపై వేటు పడుతుందనే చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇండియా టుడేతో మాట్లాడాడు. ‘‘కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్‌లను ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలి. కెప్టెన్ రోహిత్ శర్మ కోసం శుబ్‌మన్ గిల్ తన మూడోస్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో రాగా.. మిగతా స్థానాల్లో యథావిధిగా అందరూ కొనసాగాలి.
గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలి
గిల్ మరికొన్నాళ్లు వేచి చూడాలి. నిజానికి జురెల్‌కు తొలి టెస్టులో అవకాశం ఇచ్చారు. కానీ అతడు పరుగులేమీ రాబట్టలేకపోయాడు. కాబట్టి అతడిని బెంచ్‌కే పరిమితం చేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ.. గిల్‌ను ఓపెనింగ్ నుంచి ఐదో స్థానం వరకు ఎక్కడా ఆడించలేము కదా!
ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవడం మంచిదే. బెంచ్ ఎంత పటిష్టంగా ఉందో తెలియజేస్తుంది. మేనేజ్‌మెంట్ గిల్ వైపు మొగ్గు చూపి జురెల్‌ను తప్పించవచ్చు. అయితే, నా అభిప్రాయం ప్రకారం జురెల్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలి’’ అని భజ్జీ పేర్కొన్నాడు.
ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ ఫిఫ్టీ
కాగా ఆసీస్-‘ఎ’ జట్టుతో రాణించిన జురెల్.. తొలి టెస్టులో మాత్రం నిరాశపరిచారడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 11, 1 పరుగులు చేశాడు. మరోవైపు.. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో పింక్ బాల్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ ఫిఫ్టీ(రిటైర్డ్ హర్ట్) సాధించాడు.
ఇక భారత్- ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు జరుగనుంది. దీనిని పింక్ బాల్‌తో నిర్వహించనున్నారు. ఇక పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాను ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: సన్‌రైజర్స్ విధ్వంసకర వీరుడు
Comments
Please login to add a commentAdd a comment