Brad Hogg: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా ఇవాళ (జూన్ 7) ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో గెలుపు ఆస్ట్రేలియాదేనని గొప్పలు పోయాడు. సుదీర్ఘ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలాకాలంగా కఠోరంగా శ్రమిస్తున్నారని, అందుకే వారు డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవగలరని ధీమా వ్యక్తం చేశాడు.
ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ కోసం ఇరు జట్లు కఠోరంగా శ్రమించాయని చెబుతూనే.. టెస్ట్ ఫార్మాట్‌కు సరిపడా ప్రాక్టీస్ టీమిండియా ఆటగాళ్లు చేయలేదని అన్నాడు. భారత ఆటగాళ్లు దాదాపు రెండు నెలల పాటు పొట్టి ఫార్మాట్ (ఐపీఎల్ 2023) ఆడి నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ బరిలో దిగారని, వారు చేసిన స్వల్పపాటి సాధనతో టెస్ట్ క్రికెట్‌కు అలవాటు పడలేరని తెలిపాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆసీస్ ఆటగాళ్లు అసాధారణ రీతిలో సాధన చేశారని, ఇదే భారత్‌పై ఆసీస్‌కు అడ్వాంటేజ్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఏ జట్టైనా గెలవాలంటే, సాధన చాలా కీలకమని, ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్‌కు ఛేంజ్ అయ్యే సమయంలో దీని డోస్ మరింత పెరగాలని, అధిక సమయం ఫార్మాట్‌కు తగ్గ ప్రాక్టీస్ చేసిన జట్టుదే అంతిమంగా విజయమని అన్నాడు.
ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. లంచ్ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా డకౌట్ కాగా.. డేవిడ్ వార్నర్ 43 పరుగులు చేసి ఔటయ్యాడు. లబూషేన్ (26), స్టీవ్ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఖ్వాజా వికెట్ సిరాజ్ పడగొట్టగా.. వార్నర్ వికెట్ ఠాకూర్‌కు దక్కింది.
చదవండి: WTC Final: అశ్విన్ లేకపోవడం టీమిండియాకు ప్లసా.. మైనసా..?
Comments
Please login to add a commentAdd a comment