వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా వరుసగా రెండో సీజన్లో ఫైనల్కు చేరి ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్లో ఎలాగైనా టైటిల్ గెలుస్తుందని భావించిన అభిమానుల ఆశలను టీమిండియా ఆటగాళ్లు పటాపంచలు చేశారు. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి రోజు కనీస ప్రతిఘటన కూడా లేకుండా ఓటమిని ఒప్పుకున్నారు. ఆదుకుంటారనుకున్న కోహ్లి (49), రహానే (46) ఉసూరుమనిపించగా.. రవీంద్ర జడేజా (0), శార్దూల్ ఠాకూర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.
ఆంధ్ర ఆటగాడు శ్రీకర భరత్ తూతూమంత్రంగా 23 పరుగులు చేసి ఔట్ కాగా.. ఉమేశ్ యాదవ్, సిరాజ్ తలో ఒక్క పరుగు చేసి వెనుదిరిగారు. ఫలితంగా టీమిండియా 209 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగి భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని ఎదుర్కంది. టీమిండియా సభ్యులు 10 ఏళ్ల భారత ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేస్తారనుకుంటే, దారుణంగా నిరాశపరిచారు. భారత ఓటమితో అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
కాగా, 444 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీసం డ్రా కూడా చేసుకోలేక చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 469 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: ఆసియా కప్ 2023 విషయంలో పంతం నెగ్గించుకున్న పాకిస్తాన్..!
Comments
Please login to add a commentAdd a comment