ఓవల్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతుంది. తొలుత (తొలి ఇన్నింగ్స్) బ్యాటింగ్‌లో ఆతర్వాత బౌలింగ్‌లో పైచేయి సాధించిన ఆసీస్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో కాస్త తడబడుతున్నప్పటికీ, గెలుపుకు కావాల్సిన లీడ్‌ను ఇప్పటికే సాధించేసింది. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి ఆ జట్టు 374 పరుగుల లీడ్‌లో (201/6) కొనసాగుతుంది. చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నాయి. పిచ్ పరిస్థితుల దృష్ట్యా మరో 50 పరుగులు చేయడం ఆసీస్‌కు పెద్ద కష్టమైన పనేమీ కాకపోవచ్చు. ఇదే జరిగితే టీమిండియా కనీసం 430 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తుంది.
అయితే ఓవల్ మైదానం చరిత్రలో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేకపోవడం టీమిండియా అభిమానులను కలవరపెడుతుంది. అయినా ఏదో మూల టీమిండియా గెలుస్తుందనే ఆశతో వారు టీవీలకు అతుక్కుపోయారు. పరిస్థితులన్నీ ఆసీస్‌కే అనుకూలంగా ఉన్నప్పటికీ, పటిష్టమైన భారత బ్యాటింగ్ లైనప్‌పై వారు నమ్మకం కలిగి ఉన్నారు. హీన పక్షంలో కనీసం డ్రా అయినా చేసుకోగలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
గిల్, కోహ్లి, పుజారా, రహానేలపై యావత్ భారత క్రికెట్ అభిమానులు భారీ అంచనాలు కలిగి ఉన్నారు. ఇటీవలికాలంలో ఇంగ్లండ్ అవళంభిస్తున్న బజ్‌బాల్ అప్రోచ్‌ను ఆచరణలో పెట్టి టీమిండియా గెలవాలని యావత్ భారతావణి ఆకాంక్షిస్తుంది. మరి మన బ్యాటర్లు ఏం చేస్తారో వేచి చూడాలి. ఎదురుదాడికి దిగి గెలుస్తుందా.. లేక డిఫెన్స్‌కకు ప్రాధాన్యమిచ్చి డ్రా చేసుకుంటుదా.. ఎటూ కాకుండా చేతులెత్తేస్తుందా అన్న విషయాలు తేలాలంటే మరికొద్ది గంటల పాటు వేచి చూడాల్సిందే. టీమిండియా విజయావకాశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
స్కోర్ వివరాలు..
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 ఆలౌట్ (హెడ్ 163, స్మిత్ 121, సిరాజ్ 4/108)
- భారత్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ (రహానే 89, ఠాకూర్ 51, కమిన్స్ 3/83)
- ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 201/6 (అలెక్స్ క్యారీ 41 బ్యాటింగ్, జడేజా 3/44)
ఆసీస్ 374 పరుగుల ఆధిక్యంలో ఉంది
చదవండి: అడ్డుకునేలోపే అదిరిపోయే ట్విస్ట్.. జడ్డూ దెబ్బకు మైండ్‌బ్లాక్
Comments
Please login to add a commentAdd a comment