
ఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు జాస్ బట్లర్ నమ్మకమైన ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాగ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. గత మ్యాచుల్లో అనుకున్న స్థాయిలో రాణించకపోయినా ముంబైతో జరిగిన మ్యాచ్‌తో మంచి ఫామ్‌లోకి వచ్చాడని అన్నాడు. కానీ స్టీవ్ స్మిత్ పేవల ఫామ్ చూసి నిరాశ చెందానని... మొదటి రెండు మ్యాచుల్లో ఆఫ్ సెంచరీలు చేసినప్పటికీ గత మూడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోర్ చేయడం ఆ జట్టును కలవరపెడుతుందని తెలిపాడు. అనవసరమైన షాట్లు ఆడి వికెట్ కోల్పోతున్నాడని, బహుషా అక్కడి వాతావరణం కారణమై ఉండొచ్చని హాగ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో మొదటి రెండు మ్యాచులు గెలిచి అందరి దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్, గత మూడు మ్యాచుల్లో ఓటమిని చవిచూసి పాయింట‍్ల పట్టికలో ఏడో స్థానంలో నిలించింది. ముంబైతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ ఓడినప్పటికీ జాస్ బట్లర్ తిరిగి ఫామ్‌లోని రావడం ఆ జట్టుకు మంచి పరిణామం. ఈ సీజన్‌లో బట్లర్ ఆడిన మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించాడు. 44 బంతుల్లో 70 పరుగులు చేయగా ఇందులో ఐదు సిక్సులు, నాలుగు ఫోర్లు బాదాడు.
(ఇదీ చదవండి: వారిద్దరి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా..)
Comments
Please login to add a commentAdd a comment