Brad Hogg: పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా చేసిన పెద్ద తప్పు అదే.. | T20 World Cup 2021 Ind Vs Pak Brad Hogg Think Big Mistake Playing This Man | Sakshi
Sakshi News home page

Ind Vs Pak: టీమిండియా చేసిన పెద్ద తప్పు అదే.. అతడిని ఆడించకపోయి ఉంటే: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

Published Mon, Oct 25 2021 12:51 PM | Last Updated on Mon, Oct 25 2021 3:36 PM

T20 World Cup 2021 Ind Vs Pak Brad Hogg Think Big Mistake Playing This Man - Sakshi

Brad Hogg Comments On Team India Defeat Against Pakistan: టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ స్పందించాడు. హార్దిక్‌ పాండ్యాను బ్యాటర్‌గా తుది జట్టులోకి తీసుకుని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పెద్ద తప్పుచేశాడని అభిప్రాయపడ్డాడు. కాగా ప్రపంచకప్‌లో చరిత్రను తిరగరాస్తూ పాకిస్తాన్‌ టీమిండియాపై అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

ఆదిలోనే కీలక వికెట్లు తీసి షాహిన్‌ ఆఫ్రిది కోలుకోలేని దెబ్బ కొట్టినా... కోహ్లి కెప్టెన్‌  ఇన్నింగ్స్‌(49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడటంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరు(151) చేయగలిగింది. కానీ... లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఘోరంగా విఫలమైంది. పాకిస్తాన్‌ ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజం చెలరేగి ఆడటంతో పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా బౌలర్లు ఒక్కరు కూడా ప్రభావం చూపలేకపోయారు.

ఈ నేపథ్యంలో బ్రాడ్‌ హాగ్‌ మాట్లాడుతూ... ‘‘హార్దిక్‌ పాండ్యాను ఆడించి పెద్ద తప్పు చేశారు. షమీ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ను.. పాండ్యా స్థానంలో అశ్విన్‌ను జట్టులోకి తీసుకుని ఉంటే బాగుండేది. అలా అయితే.. జడేజా ఆరో స్థానంలో.. ఠాకూర్‌ ఏడో స్థానంలో... అశ్విన్‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉండేది. ఒకవేళ పాండ్యా తుది జట్టులో ఉండాలనుకుంటే.. కచ్చితంగా బౌలింగ్‌లోనూ రాణించాలి. అతడికి చాలా టాలెంట్‌ ఉంది. కానీ.. ఫ్రంట్‌లైన్‌ బ్యాటర్‌గా తనను జట్టులోకి తీసుకోవడం సరికాదు’’ అని అభిప్రాయపడ్డాడు.

ఇక రిషభ్‌ పంత్‌ అవుట్‌ కావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగిందన్న బ్రాడ్‌ హాగ్‌.. ‘‘నిజానికి మిడిల్‌ ఓవర్లలో పంత్‌కు.. పాక్‌ స్పిన్నర్లకు అసలైన పోరు జరిగింది. పంత్‌కు బౌలింగ్‌ చేసే సమయంలో షాబాద్‌ ఖాన్‌ కాస్త తడబడ్డాడు. తొలుత లెగ్‌ సైడ్‌ బౌల్‌ చేశాడు. అంతలోనే ఎవరో వచ్చి అతడితో మాట్లాడారు. ఇంకేముంది వెంటనే పంత్‌ అవుట్‌ అయ్యాడు’’ అని చెప్పుకొచ్చాడు. 

చదవండి: T20 World Cup Ind Vs Pak: అతడిని ఒక బ్యాట్స్‌మన్‌గా కూడా ఆడించగలం: విరాట్‌ కోహ్లి
Ind Vs Pak: ‘చెత్త అంపైరింగ్‌.. అసలు రాహుల్‌ అవుట్‌ కాలేదు.. అది నో బాల్‌.. కావాలంటే చూడండి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement