వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్న తిలక్ వర్మపై ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్ వర్మ తన బ్యాటింగ్ స్కిల్స్‌తో తనను ఎంతగానే అకట్టుకున్నాడని హాగ్ కొనియాడాడు. కాగా దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో దుమ్మురేపిన ఈ హైదరాబాదీకి విండీస్ టూర్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.
గత రెండు సీజన్లగా ముంబై ఇండియన్స్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ వర్మ.. తన అద్బుత ప్రదర్శరనతో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. ఐపీఎల్ 2023లో 11 మ్యాచ్‌లు ఆడిన వర్మ 42.88 సగటుతో 343 పరుగులు చేశాడు. ఇక వర్మతో పాటు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం యశస్వీ జైశ్వాల్‌కు కూడా భారత టీ20 జట్టులో చోటు దక్కింది.
ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. తిలక్ వర్మ ఒక అద్బుతం. అతడు తన ప్రదర్శనతో ఎంతగానే అకట్టుకున్నాడు. ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టుతో కాస్త సమయం గడిపాను. అతడు ప్రత్యర్ది బౌలర్లను అర్ధం చేసుకునే విధానం నాకు చాలా నచ్చింది. వర్మకు ఏ స్ధానంలైనా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది.
ఎటువంటి క్లిష్ట పరిస్ధితులనైనా తనకు అనుగుణంగా మార్చుకుంటాడు. అదే విధంగా యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, జైస్వాల్ ఇద్దరూ అధిక స్ట్రైక్ రేట్లు కలిగి ఉన్నారు. వారు ఫాస్ట్ బౌలర్‌లను అద్భుతంగా ఎదుర్కొంటారు. కాబట్టి పవర్ ప్లేలో వీరిద్దరూ హిట్టింగ్ చేస్తే ప్రత్యర్ధి బౌలర్లకు కష్టాలు తప్పవు అని అతడు చెప్పుకొచ్చాడు.
చదవండి: ODI WC 2023: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ కాదు.. ఆ జట్టుతో చాలా డేంజర్! లేదంటే?
Comments
Please login to add a commentAdd a comment