
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడి సారథ్యంలో భారత్ ఇటీవల వెస్టిండీస్, శ్రీలంకతో టీ20,వన్డే సిరీస్‌లను సొంతగడ్డపై క్లీన్ స్వీప్ చేసింది. ఆ క్రమంలో రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రోహిత్ తన కెప్టెన్సీ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడని బ్రాడ్ హాగ్ కొనియాడాడు. అయితే ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లతో ఆడినప్పుడు రోహిత్ కెప్టెన్సీ స్కిల్స్ బయటపడతాయి అని అతడు తెలిపాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ రోహిత్‌కు అతి పెద్ద సవాల్ అని పేర్కొన్నాడు.
"త్వరలో ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. అది రోహిత్ శర్మకు కఠిన సవాల్‌కు మారనుంది. నేను అతనిని ఒత్తిడిలో చూడాలనుకుంటున్నాను. ఆ సమయంలో ఇప్పటి లాగే ప్రశాంతమైన బాడీ లాంగ్వేజ్‌ని కలిగి ఉంటాడా లేదా మనం కోపాన్ని చూస్తామా. భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్, ఇంగ్లాండ్ పర్యటన, ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనోంది. కాబట్టి రాబోయే అన్నీ టోర్నీలు రోహిత్ కఠినమైనవి" అని హాగ్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: కేఎల్ రాహుల్ జట్టులోకి జింబాబ్వే స్టార్ బౌలర్!
Comments
Please login to add a commentAdd a comment