ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మాజీ క్రికెటర్ | Ex-Australia spinner Hogg considered suicide | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మాజీ క్రికెటర్

Published Mon, Oct 31 2016 1:22 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మాజీ క్రికెటర్ - Sakshi

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మాజీ క్రికెటర్

సిడ్నీ: గతంలో ఆస్ట్రేలియా క్రికెట్లో కీలకమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన బ్రాడ్ హాగ్ ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడట. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నతరువాత ఆత్మహత్య చేసుకోవడానికి దాదాపు సిద్ధమైనట్లు హాగ్ పేర్కొన్నాడు. ఇందుకు కారణం తన వైవాహిక జీవితం చిందర వందర కావడమేనని బ్రాడ్ హాగ్ తన తాజా పుస్తకం 'ద రాంగ్ యూఎన్' లో ప్రస్తావించాడు.

'ఆత్మహత్య చేసుకోవడానికి ప్రణాళిలకు సిద్ధం చేసుకున్నా. దానిలో భాగంగా కారును ఫ్రెమెంటల్స్ పోర్ట్ బీచ్ వద్ద పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్లా. అలా సముద్రాన్ని, అందులోని నీటిని చూస్తూ కూర్చున్నా. అయితే నాకు ఈత రావడంతో నీటిలో పడి ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదనుకున్నా. అతి కష్టంమీద ఆ ఆలోచనను విరమించుకుని వచ్చేశా. మరోసారి చీకటి ప్రదేశంలోకి వెళ్లి ప్రశాంతంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. అయితే ఆ సమయంలో ఇంకా ఏదో సాధించాలనే తపన నాలో ఎక్కువైంది. ఆలోచించడం వేరు, చేయడం వేరు అనే విషయం అప్పుడే నాకు బోధ పడింది. ఇక ఆత్మహత్య అనే విషయాన్నిపక్కను పెట్టి నా అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యా' అని మాజీ స్పిన్నర్ హాగ్ తెలిపాడు.

 

2003, 07ల్లో ఆస్ట్రేలియా సాధించిన వన్డే వరల్డ్ కప్ల్లో హాగ్ కీలక పాత్ర పోషించాడు. అయితే 2007-08 సీజన్లో అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకున్నతనకు వైవాహిక జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురైనట్లు హాగ్ పేర్కొన్నాడు. దాంతోనే ఆత్మహత్య తలంపు వచ్చినట్లు హాగ్ స్పష్టం చేశాడు. మరొక ఆప్షన్ అనేది లేక ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు హాగ్ పుస్తకంలో వెల్లడించాడు. గతేడాది  ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో కోల్ కతా నైట్ రైడర్స్ తరుపున ఆడిన హాగ్.. ఈ లీగ్ లో అత్యధిక వయసు కల్గిన వెటరన్ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం 45 ఒడిలో ఉన్న హాగ్.. బిగ్ బాష్ లీగ్లో మెల్బోర్న్ రెనెగేడ్స్కు ఆడతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement