పచ్చని చెట్లు చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చెట్ల మధ్య కాసేపు గడిపితే చాలు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. స్వచ్చమైన గాలిని అందిస్తూ మేలు చేసే చెట్ల గురించే ఇప్పటివరకు మనకు తెలుసు.. కానీ కొన్ని మొక్కలు మనుషుల ప్రాణాలను తీయగలవని మీకు తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్కలు ఈ భూమ్మీద కొన్ని ఉన్నాయి. మొక్కే కదా కని పొరపాటున వాటిని ముట్టుకున్నా ప్రాణాలను తీసేస్తుంది. స్వయంగా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. ఇంత భయంకరమైన మొక్కలు ఎక్కడ ఉంటాయి? వాటి కథేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మొక్కలుగా గింపీ-గింపీ (Gympie-Gympie)ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉర్టికేసి రేగుట జాతికి చెందిన ఈ మొక్కలు ఎక్కువగా ఆస్త్రేలియా, ఇండోనేషియా అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. పొరపాటున వీటి ఆకులను తాకినా భయంకరమైన నొప్పి కలుగుతుందట. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకునేలా ఇవి మనల్ని ప్రేరేపిస్తాయట. అందుకే ఈ మొక్కలను ‘సూసైడ్ ప్లాంట్ ’(Suicide Plant)అంటారు.
వీటి వల్ల మనుషులకే కాదు, జంతువుకలకు కూడా హానీ కలుగుతుందట. 1886లో ఓ గుర్రం ఈ మొక్కను తాకిన కాసేపటికే మతిస్థిమితం కోల్పోయి 2గంటల్లోనే మరణించినట్లు పరిశోధకులు తెలిపారు. గింపీ-గింపీ ఆకులపై సన్నని సూదుల్లాంటి ఉంటాయట. వీటిని ముట్టుకుంటే ఆ నొప్పి భరించలేక చనిపోవడమే బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుందట.
ఈ ఆకులను ముట్టుకున్న 30 నిమిషాల్లోనే దద్దుర్లు, వాపులు వచ్చి నొప్పి తీవ్రంగా మారుతుందట. దీంతో నిద్రపోవడం కూడా కష్టమే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.పొరపాటున ఆ మొక్కలను ముట్టుకొని తక్షణం చికిత్స తీసుకున్నా పెద్దగా ఫలితం ఉండదట. చాలా సంవత్సరాల పాటు ఆ నొప్పి శరీరంలో అలాగే ఉంటుందట. కాబట్టి గింపీ జోలికి వెళ్లకపోవడమే బెటర్.
Comments
Please login to add a commentAdd a comment