న్యూఢిల్లీ : వీడియోలో వెంటాడుతూ వస్తోన్న పాము అత్యంత ప్రమాదకరమైనది. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే ఈ పామును ‘ఈస్టర్న్ బ్రైన్ స్నేక్’ అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ విషమున్న సర్పాల్లో ఇది రెండో జాతికి చెందినది. ఇది కరచిన వ్యక్తి ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోతాడని వెంటాడుతున్న ఈ పామును వీడియో తీసిన 52 ఏళ్ల టోరి హారిసన్ తెలిపారు. ఈ పాము కాటు వల్లనే ఆస్ట్రేలియాలో ఎక్కువ మంది మరణిస్తున్నారు. పాము కాటు వల్ల మరణించిన వారిలో 60 శాతం మంది ఈ పాము విషయం వల్లనే మరణించినట్లు తేలింది.
పడగ లేకున్నా తలెత్తి బార్లా నోరు తెరచి మనుషుల మీదికి, జంతువుల మీదికి వెంటాడుతూ రావడం దీన్ని ప్రత్యేక లక్షణమని, తన ప్రాణ రక్షణలో భాగంగా మనల్సి భయపెట్టడానికే ఈ పాము ఎక్కువగా వెంటాడుతున్నట్లు వస్తుందని టోరి తెలిపారు. మన మానాన మనం వెళుతుంటే ఈ పాము ఏమనదని ఆయన చెప్పారు.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన టోరి హారిసన్‌కు పాములు పట్టడంలో ఎంతో నేర్పరి. గోల్డ్ కోస్ట్ సిటీ శివారులోని పింపామ వద్ద శనివారం నాడు తనకు ఈ పాము కనిపించిందని దాన్ని వీడియో తీస్తూనే పట్టుకున్నానని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వదిలేశానని ఆయన చెప్పారు. సమాజంలో ఇంతకన్నా విష పూరితులను మనం చూస్తుంటామని, అలాంటప్పుడు దీన్ని ఎందుకు చంపాలని వదిలేశానని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment