
ఎస్.కోట పట్టణంలోని ఇండియన్ ఆయిల్ బంక్ సమీపంలో రాత్రి 7.30 గంటల సమయంలో సుమారు 13 అడుగుల పొడవు ఉన్న గిరినాగు హల్‌చల్ చేసింది. దీనిని స్థానికులు గుర్తించి స్నేక్‌క్యాచర్ వానపల్లి రామలింగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు.
ఆయన చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాటిపూడి రిజర్వాయర్ అటవీప్రాంతంలో పామును విడిచిపెడతానని స్నేక్‌క్యాచర్ తెలిపాడు.