
వజ్రపుకొత్తూరు రూరల్ : మండ లంలోని సీతాపురం గ్రామానికి చెందిన దుంపల తిరుపతి ఇంట్లో మంగళవారం ఉదయం 13 అడుగుల తాచుపాము ప్రవేశించి హల్‌చల్ చేసింది. దీంతో ప్రాణభయంతో ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులు బయటకు పరుగుల తీశారు. విషయం తెలుసుకున్న యువకులు అక్కడకు చేరుకుని పామును బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో హతమార్చారు. ఇంత పెద్ద తాచుపామును ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు తెలిపారు. కాగా, పామును చూసేందుకు పెద్ద ఎత్తున జనం ఎగబడ్డారు.