
హతమైన వైరాగి నాగులు
మందస: మండలంలోని మందస పట్టణం పరిసర ప్రాంతాలతో పాటు చిన్నబరంపురం, బుడంబో, కలువమ్మతల్లి ఆలయం తదితర ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వైరాగి నాగులను గ్రామస్తులు సోమవారం హతమార్చారు.
సుమారు 15 అడుగులు పొడవు ఉన్న ఈ పాములు రెండూ కలసి తిరుగుతుండడంతో వాటి సమీపానికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. సోమవారం ఈ రెండు పాములు పొల్లాల్లో ఉన్న రైతులు, కూలీలను బుసలు కొట్టి భయపెట్టడంతో వారు వీటిని హతమార్చారు. ఒకేసారి రెండు నాగుపాములు హతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment