
మృతి చెందిన ఎనిమిది అడుగుల కొండచిలువ
తెర్లాం విజయనగరం : మండలంలోని వెలగవలస గ్రామంలో ఎనిమిది అడుగుల పొడవున్న కొండచిలువ మంగళవారం రైతుల చేతిలో హతమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొందరు రైతులు ఉద్యానవన పంటలకు సంబంధించి మొక్కలు నాటేందుకు గోతులు తవ్వేందుకు పొలానికి వెళ్లారు.
గోతులు తవ్వుతుండగా పక్కనే ఉన్న తాటిచెట్ల వద్ద పెద్ద శబ్ధం రావడంతో అక్కడికి వెళ్లి చూస్తే సుమారు ఎనిమిది అడుగులపైనే ఉన్న కొండ చిలువ కనిపించింది. దీంతో భయపడిన రైతులు కర్రలతో కొండ చిలువను కొట్టి చంపేశారు.