హతమార్చిన కొండచిలువను చూపిస్తున్న గ్రామస్తులు
వజ్రపుకొత్తూరు : గొర్రెలు, మేకలు, కోళ్లు, ఆవు దూడలను రుచి మరిగిన కొండచిలువను స్థానికులు హతమార్చారు. సుమారు 16 అడుగులు పొడవు ఉన్న కొండ చిలువ నందిగాం మండలం బోరుభద్ర పంచాయతీ కృష్ణరాయపురం గ్రామంలో ఆదివారం ఉపాధి పనులు చేస్తున్న వారి చేతికి చిక్కి హతమైంది.
గ్రామం చుట్టూ దట్టమైన జీడిమామిడి తోటలు, చెరువులు ఉండడంతో కొండచిలువలు అక్కడే ఉంటూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గతంలో కృష్ణరాయపురం గ్రామ పరిధిలో మూడు కొండ చిలువలను హతమార్చారు. అటవీ, ఇతర అధికారులు పరిశీలించి ఈ సర్పాలను పట్టుకుని జూకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment