ఎక్కడైనా పాము కనిపిస్తే మనం ఏం చేస్తాము. భయంతో వెంటనే అక్కడి నుండి పక్కకి జరగడమో లేక పారిపోవడమో చేసాము కదా.. కానీ, ఓ 11 ఏళ్ల బాలిక మాత్రం చిన్న పామే కదా అని.. దాన్ని చేతితో పట్టుకుంది. అనంతరం అది ఎంతో విషపూరితమైందని తెలుసుకుని ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఓ బాలిక(11) తన గ్రాండ్ పేరెంట్స్‌తో బయటకు వెళ్లింది. ఈ సందర్భంగా తనకు ఓ గోధుమ రంగులలో ఉండే అత్యంత విషపూరితమైన చిన్న పాము కనిపించింది. దీంతో, వెంటనే ఆమె.. పామును తన చేతుల్లోకి తీసుకుంది. ఆ పాము తన అరచేతిలో అటు ఇటూ కదులుతూ ఉంది. ఈ క్రమంలో పామును వదిలేయని తన కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పినా ఆమె అదేమీ పట్టించుకోలేదు.
ఇంతలోనే ఒక సభ్యుడు ఈ ఘటనకు తన సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ స్నేక్ క్యాచర్ స్పందించాడు. ఆ పాము అత్యంత విషపూరితమైనదని పేర్కొన్నాడు. పాము విషయంలో చిన్నారి ఎంతో అదృష్టవంతురాలు.. పాము కాటు వేసి ఉంటే ఆమె చనిపోయి ఉండేదని తెలిపాడు. దీంతో, చిన్నారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. కాగా, ఈ పాముల కాటువేసిన కారణంగానే ఆస్ట్రేలియాలో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. చిన్నారి ఎంతో లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
😳 @7NewsAustralia || Little girl picks up deadly eastern brown snake in Melbourne’s southwest in alarming video.
— PiQ (@PriapusIQ) October 22, 2022
She told the video she had found a garter snake, which are harmless and native to north and central America.https://t.co/hUXYKkeyzG pic.twitter.com/K1sl454PTV
Comments
Please login to add a commentAdd a comment