World Largest Plant Discovered In Australian Coast By Researchers, Video Goes Viral - Sakshi
Sakshi News home page

World Largest Plant In Ocean: వయసు 4,500 ఏళ్లు.. పొడవు 180 కి.మీ. మేర!!.. నిజంగానే వింత ఇది

Published Thu, Jun 2 2022 11:04 AM | Last Updated on Thu, Jun 2 2022 12:55 PM

World Largest Plant Discover in Australia Sea By Researchers - Sakshi

నీటి అడుగున వింత వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కను గుర్తించారు. సుమారు 180 కిలోమీటర్ల పొడవు మేర విస్తరించి ఉన్న ఈ మొక్కను.. అత్యంత పురాతనమైందిగా కూడా భావిస్తున్నారు పరిశోధకులు. 

పోసిడోనియా ఆస్ట్రేలిస్‌ రకం మొక్క అని తేల్చారు. ఈ మొక్క సుమారు 4,500 ఏళ్ల కిందటి నాటిదని పరిశోధకులు గుర్తించారు.  ఆస్ట్రేలియా పశ్చిమ భాగంలో షార్క్‌ తీరంలో నీటి అడుగున ఈ మొక్కను పరిశోధకులు గుర్తించారు. దాదాపు 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ మొక్క. ప్రపంచంలోనే ఈ సైజు మొక్క గుర్తించడం ఇదే తొలిసారి.

ఉపరితలమే 20 వేల రగ్బీ మైదానాలకు సమానంగా ఉంది. గ్లాస్గో నగరం కంటే పెద్దదిగా.. మాన్‌హట్టన్‌ ఐల్యాండ్‌కు మూడు రెట్లు సైజులో ఉంది అది. సముద్ర గర్భంలో పరిశోధనలు చేస్తుండగా.. అనుకోకుండానే ఈ మొక్క గురించి వెలుగులోకి వచ్చింది. ఒకటికి పదిసార్లు పరీక్షించాకే.. ఇదంతా ఒకే మొక్కగా నిర్ధారించారు పరిశోధకులు. పైగా ఈ మొక్క ఒక విత్తనం నుంచే ఇది విస్తరించిందని జన్యు పరిశోధన ద్వారా తేల్చారు. 

ఈ మొక్క వయసు 4,500 ఏళ్లు ఉంటుందని, 180 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంటుందని భావిస్తున్నారు. పోసిడోనియా ఆస్ట్రేలిస్‌ రకం మొక్క అని తేల్చారు. రాయల్‌ సొసైటీ బీలో ఈ మేరకు ఈ మొక్కకు అధ్యయనం ప్రచురితమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement