Brad Hogg Hillarious Reply To Fan CSK Win IPL Title Failure Middle Order - Sakshi
Sakshi News home page

IPL 2021: మిడిలార్డర్‌ ఇలా ఉంటే కష్టం.. అది మాత్రం తెలియదు

Published Tue, Oct 5 2021 1:42 PM | Last Updated on Tue, Oct 5 2021 6:30 PM

Brad Hogg Hillarious Reply To Fan CSK Win IPL Title Failure Middle Order - Sakshi

Brad Hogg Reveals About CSK Winning IPL Title.. ఐపీఎల్‌ 2021లో సీఎస్‌కే ఫైనల్‌ చేరడం ఖాయమని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హగ్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరిన సీఎస్‌కే క్వాలిఫయర్‌1 లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడగొట్టి ఫైనల్లో అడుగుపెడుతుందని తెలిపాడు. అయితే ఢిల్లీతోనే ఫైనల్‌ ఆడుతుందని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి సీఎస్‌కే జట్టులో ఓపెనింగ్‌ అద్భుతంగా ఉంది. రుతురాజ్‌ గై​క్వాడ్‌, డుప్లెసిస్‌లు సూపర్‌ఫామ్‌ను కనబరుస్తూ జట్టుకు అదిరిపోయే ఆరంభాలు ఇస్తున్నారు. అయితే వీరిద్దరు విఫలమైనచోట అసలు సమస్య మొదలవుతుంది. మిడిలార్డర్‌లో వస్తున్న రాయుడు, మొయిన్‌ అలీ, రైనా, ధోనిలు పూర్తిగా నిరాశపరుస్తున్నారు.

చదవండి: MS Dhoni: బంతులన్నీ వృథా చేశావు.. అవుటైనా బాగుండేది.. కనీసం..

సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఇదే కనబడింది. గైక్వాడ్‌, డుప్లెసిస్‌లు త్వరగా ఔట్‌ కావడంతో సీఎస్‌కే తక్కువ స్కోరుకే పరిమితమైంది. రాయుడు అర్థసెంచరీతో మెరవడంతో 130 పరుగులు మార్క్‌ను అందుకోగలిగింది. ఇదే విషయమై బ్రాడ్‌ హగ్‌ను.. ''మిడిలార్డర్‌ ఇలా ఉంటే సీఎస్‌కే కప్‌ కొడుతుందా..'' అంటూ ఒక అభిమాని ప్రశ్నించాడు. దీనికి హగ్‌.. సీఎస్‌కే వర్సెస్‌ ఢిల్లీ ఫైనల్‌ మాత్రమే చూస్తా.. కప్‌ కొట్టే విషయం నాకు తెలియదు అంటూ కామెంట్‌ చేశాడు. 

ఇక మరో అభిమాని ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగో జట్టు ఎవరు అని అడగ్గా.. ''కేకేఆర్‌ చేరుతుంది.. కానీ రాజస్తాన్‌, ముంబైల నుంచి గట్టిపోటి ఉండే అవకాశం ఉంటుంది.'' అని కామెంట్‌ చేశాడు. 

చదవండి: MI Vs RR: ఒక్క మ్యాచ్‌.. నాలుగు రికార్డులు బద్దలయ్యే అవకాశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement