ఢిల్లీ క్యాపిటల్స్‌ సెలబ్రేషన్స్‌లో 'క్రిస్టియానో రొనాల్డొ' | IPL 2021: Ripal Patel Made Celebrations Like Cristiano Ronaldo Viral | Sakshi
Sakshi News home page

IPL 2021: ఢిల్లీ క్యాపిటల్స్‌ సెలబ్రేషన్స్‌లో 'క్రిస్టియానో రొనాల్డొ'

Published Tue, Oct 5 2021 3:26 PM | Last Updated on Tue, Oct 5 2021 3:34 PM

IPL 2021: Ripal Patel Made Celebrations Like Cristiano Ronaldo Viral - Sakshi

Courtesy: IPL Twitter

Cristiano Ronaldo In Delhi Capitals Celebrations.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా సోమవారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 పాయింట్లతో టాప్‌ స్థానానికి చేరుకుంది.  కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సెలబ్రేషన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా రిపల్‌ పటేల్‌ రొనాల్డొ తరహాలో చేసిన సెలబ్రేషన్స్‌ హైలెట్‌ అయ్యాయి. కాగా రిపల్‌ పటేల్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఇదే డెబ్యూ మ్యాచ్‌. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. 

చదవండి: Cristiano Ronaldo: డ్రా అనుకున్న దశలో సూపర్‌ గోల్‌.. షర్ట్‌ విప్పి రచ్చరచ్చ

ఇక మ్యాచ్‌లో మొదట చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు (43 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. ‘ప్లేయర్‌  ఆఫ్‌ ద మ్యాచ్‌’ అక్షర్‌ పటేల్‌ (2/18) చెన్నైని దెబ్బ తీశాడు. అనంతరం ఢిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మైర్‌ (18 బంతుల్లో 28 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టును గెలిపించే ఆట ఆడారు.

చదవండి: MI Vs RR: ఒక్క మ్యాచ్‌.. నాలుగు రికార్డులు బద్దలయ్యే అవకాశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement