PC: IPL Twitter
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కరోనా ఆడుకుంటుంది. ఆదివారం(మే 8న) రాత్రి సీఎస్‌కేతో ఢిల్లీ మ్యాచ్ ఆడనుంది. అయితే మ్యాచ్‌కు ముందు ఆ జట్టులో మరోసారి కరోనా వైరస్ కలవరపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ నెట్‌బౌలర్ కరోనా పాజిటివ్‌గా తేలాడు. రెగ్యులర్ కరోనా టెస్టింగ్‌లో భాగంగా ఆటగాళ్లందరికి పరీక్షలు నిర్వహించగా.. నెట్ బౌలర్‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆటగాళ్లందరిని ఐసోలేషన్ పేరిట హోటల్ రూంకు తరలించారు. వారందరికి మరోసారి పరీక్షలు చేశారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాతే మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది తెలుస్తుంది.
కాగా ఇంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మిచెల్ మార్ష్, టిమ్ సీఫెర్ట్ సహా ఫిజియో పాట్రిక్, మరో నలుగురు కరోనా బారిన పడ్డారు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు ఇది జరిగింది. దీంతో చివరి నిమిషంలో పుణేలో జరగాల్సిన మ్యాచ్‌ను వాంఖడేకు వేదికను మార్చారు.
ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పడుతూ లేస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన పంత్ సేన 5 విజయాలు.. ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే సీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. మరోవైపు సీఎస్‌కే మాత్రం 10 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు.. ఏడు ఓటములతో దాదాపు ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయినట్లే.
చదవండి: Shimron Hetmyer: కీలక సమయంలో స్వదేశానికి రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు?
Comments
Please login to add a commentAdd a comment