
సాక్షి : దర్శకధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్.. తెలుగు చలన చిత్ర స్థాయిని ఖండాంతరాలు దాటించింది. విదేశీ మీడియా కూడా మన చిత్రాన్ని ఓ అద్భుతమంటూ పొగడ్తలు గుప్పించింది. ఇక సినిమాకు కీలకమైన మాహిష్మతి రాజ్యం గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రావీణ్యం ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపించింది కూడా. ఇక ఇప్పడు బాహుబలి ప్రస్తావన లేదు కదా.. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ఆ లోకేషన్లను టూరిస్ట్ స్పాట్‌గా చేసేశారు.
ఇక ప్రసుత్తం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. చివరి టీ20 మ్యాచ్ కోసం హైదరాబాద్‌లో బస చేశాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్గ్ కూడా టీంతోపాటే వచ్చాడు. తాజాగా ఆయన రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించాడు. అక్కడ బాహుబలి సినిమా సెట్టింగ్స్‌ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. భల్లాలదేవుడి భారీ విగ్రహాన్ని నిలిపిన వేదిక ముందు ఇదిగో ఇలా నిల్చుని ఫోటోలకు ఫోజిచ్చాడు.
పక్కనే ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమా టైంలో షూటింగ్ నిమిత్తం వేసిన రైల్వే స్టేషన్ సెట్ లోకి వెళ్లి.. అక్కడ ఓ బోగీ వద్ద కొందరు డాన్సర్లతో కలిసి లుంగి డాన్స్ స్టెప్పులేసి సందడి చేశాడు కూడా.
Comments
Please login to add a commentAdd a comment