Lungi dance
-
షారూఖ్.. లుంగీ డ్యాన్స్ సాంగ్ తనకు నచ్చలేదన్నాడు
చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలోని పాటలన్నీ హిట్టే! అందులోని లుంగి డ్యాన్స్ సాంగ్ అయితే మరింత స్పెషల్.. అయితే ఈ పాట చేయడానికి షారూఖ్ ఖాన్ నిరాకరించాడంటున్నాడు సింగర్ హనీ సింగ్. తాజా ఇంటర్వ్యూలో మరెన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. హనీ సింగ్ మాట్లాడుతూ.. నేను, గిప్పీ కలిసి ఆంగ్రేజీ బీట్ అనే మ్యూజిక్ వీడియోను థాయ్‌లాండ్‌లో షూట్ చేశాం. ఈ సాంగ్‌లో దాదాపు 400 మంది అమ్మాయిలు బికినీలో కనిపిస్తారు. రేపు నా ఇంటిమీదకొస్తే..అయితే అప్పటికే పంజాబ్‌లో(అసభ్యకరమైన లిరిక్స్ వాడుతున్నానంటూ) నామీద కోపంతో నా దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. దీంతో గిప్పి ఈ ఆంగ్రేజీ బీట్‌ను పక్కన పడేద్దామన్నాడు. నువ్వు ఢిల్లీలో ఉంటావు, కాబట్టి నీ దిష్టిబొమ్మలు తగలబెట్టినా బేఖాతరు చేస్తున్నావు. కానీ నేను పంజాబ్‌లోనే ఉంటాను. వాళ్లు మా ఇంటికి వచ్చి గొడవ చేసినా చేస్తారని భయపడ్డాడు. ఈ వీడియోను రిలీజ్ చేయకుండా ఆపేద్దామన్నాడు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించా..దానికోసం అంత ఖర్చు పెట్టింది ఇలా ఆపేయడానికా? అని చాలాసేపు వాదించాను. పంజాబ్‌లో తిరస్కరిస్తారేమో కానీ బెంగళూరు, హైదరాబాద్, వారణాసి.. ఇలా ఇతర నగరాల్లో కచ్చితంగా ఆదరిస్తారని నచ్చజెప్పేందుకు ప్రయత్నించాను. కానీ అతడు మాత్రం ఆ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే నాతో మాట్లాడనని శపథం చేశాడు. దీంతో ఆ మ్యూజిక్ వీడియోను పక్కన పడేయక తప్పలేదు.రెండూ సూపర్ హిట్ఆంగ్రేజీ బీట్ లాంటిదే ఓ సాంగ్ కావాలని కాక్టైల్ సినిమాటీమ్ అడిగింది. అలాంటిది వద్దని పార్టీ ఆల్ నైట్ కంపోజ్ చేసిచ్చాను. కానీ వాళ్లు మాత్రం ఆంగ్రేజీ బీట్‌నే తీసుకున్నారు. పార్టీ ఆల్ నైట్ మరొకరు కొనుక్కున్నారు. రెండూ సూపర్ హిట్టయ్యాయి. దీంతో ఇలాంటిదే ఇంకోటి కావాలని చెన్నై ఎక్స్‌ప్రెస్ టీమ్ అడిగింది. సరేనని లుంగీ డ్యాన్స్ కంపోజ్ చేశాను.షారూఖ్‌కు నచ్చలేదుకానీ షారూఖ్ ఖాన్ అది తనకు నచ్చలేదని రిజెక్ట్ చేశాడు. నేను నిరాశతో నిర్మాత భూషణ్ కుమార్ దగ్గరకు వెళ్లి సాంగ్ వినిపించాను. అప్పుడతడు ఇది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందన్నాడు. నిజానికి ఈ పాటను ప్రైవేట్‌గా రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ దర్శకుడు రోహిత్ శెట్టి సినిమా కోసం తీసుకున్నారు అని చెప్పాడు. బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తాత లుంగీ డాన్స్..
-
ఆసీస్‌తో మూడో వన్డే.. కోహ్లి లుంగీ డ్యాన్స్ అదిరిపోయింది! వీడియో వైరల్
ind Vs Aus 3rd ODI Chennai- Virat Kohli Dance: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఫీల్డ్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో తన బాడీ లాంగ్వేజ్, హావభావాలు, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ విరాట్ అలరిస్తూ ఉంటాడు. ఇక తాజాగా చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో వన్డే ప్రారంభానికి ముందు కోహ్లి డ్యాన్స్ చేశాడు. బౌండరీ రోప్ వద్ద 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలోని లుంగీ డ్యాన్స్ పాటకు విరాట్ స్టెప్పులు వేశాడు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. తొలి రెండు వన్డేలకు దూరమైన ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. చెన్నై మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా స్పిన్నర్ అగర్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కింది. తుది జట్లు భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా చదవండి: IPL 2023: పంజాబ్ కింగ్స్‌కు ఊహించని షాక్.. విధ్వంసకర వీరుడు దూరం! pic.twitter.com/MOGlikuSFG — javed ansari (@javedan00643948) March 22, 2023 -
లుంగీ డ్యాన్స్‌తో మాస్ స్టెప్పులేసిన కీర్తి సురేష్.. వీడియో వైరల్
'మహానటి' సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తిసురేష్. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కీర్తి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఈ ఏడాది మహేష్ సర్కారు వారి పాట సినిమాతో హిట్టు కొట్టిన కీర్తి సురేష్ ప్రస్తుతం నాని సరసన దసరా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే కీర్తి తాజాగా లుంగీ డ్యాన్స్‌తో నెట్టింట రచ్చ చేసింది. ధూమ్ ధామ్ దోస్తాన్ అనే పాటకు ఫ్రెండ్‌తో కలిసి మాస్ స్టెప్పులేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
లుంగీ డ్యాన్స్‌తో సన్నీ లియోన్ హల్చల్.. వీడియో వైరల్
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంత ఇంత కాదు. హాట్ హాట్ ఫోటోలతో పాటు బోల్డ్ వీడియోలను షేర్ చేస్తూ..కుర్రకారు మతులు పోగోడుతుంది. సన్నీలియోన్ ఒక్క ఫోటో షేర్ చేసిందంటే చాలు క్షణాల్లో లక్షల లైకులు వచ్చిచేరుతాయి. ఆమెకు కేవలం బాలీవుడ్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ షేర్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఓ మై ఘోస్ట్’ సినిమాతో సన్నీ.. కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కోసం సన్నీ లుంగీ డ్యాన్స్ చేసింది. లుంగీ ధరించి మాస్బీట్కు అనుగుణంగా సన్నీ స్టెప్పులేదు. దీనికి సంబంధించి వీడియో క్లిప్‌ని సన్నీ లియోన్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయడం.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. సన్నీ ప్రస్తుతం ‘ఓ మై ఘోస్ట్’ మూవీతో పాటు.. ‘వీరమాదేవి’, ‘రంగీలా’, ‘షెరో’, ‘కోకకోలా’, ‘హెలెన్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
హాలీవుడ్లో లుంగీ డ్యాన్స్
‘ఆల్ ది రజనీ ఫ్యాన్స్...’ అంటూ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ మూవీలో షారుక్ ఖాన్ లుంగీ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ లుంగీ డ్యాన్స్ హాలీవుడ్ సినిమాలోనూ రిపీట్ కానుంది. విన్ డీజిల్ ‘ట్రిపులెక్స్’ సినిమాలో లుంగీ డ్యాన్స్ పాటతో ఎండ్ చేయాలనుకుంటున్నారట దర్శకుడు డిజే కరుసో. ‘ట్రిపులెక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాలో దీపికా పదుకోన్ యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన నాలుగో భాగంలో దీపికా పదుకోన్ భాగం కారట. అందుకే ఇండియన్ ఫ్యాన్స్ నిరాశ పడకుండా దర్శకుడు లుంగీ డ్యాన్స్ ప్లాన్ రెడీ చేశాడు. ‘‘ట్రిపులెక్స్ నాలుగో పార్ట్‌ను లుంగీ డ్యాన్స్‌తో ఎండ్ చేయాలనుకుంటున్నా. ఆ పాటను దీపికా లీడ్ చేస్తే ఎలా ఉంటుంది? కొత్తగా ఉంటుంది కదూ’’ అని పేర్కొన్నారు దర్శకుడు. చివర్లో దీపికా లుంగీ డ్యాన్స్‌తో అలరిస్తారన్న మాట. -
మాహిష్మతి రాజ్యానికి ఊహించని అతిథి
సాక్షి : దర్శకధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్.. తెలుగు చలన చిత్ర స్థాయిని ఖండాంతరాలు దాటించింది. విదేశీ మీడియా కూడా మన చిత్రాన్ని ఓ అద్భుతమంటూ పొగడ్తలు గుప్పించింది. ఇక సినిమాకు కీలకమైన మాహిష్మతి రాజ్యం గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రావీణ్యం ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపించింది కూడా. ఇక ఇప్పడు బాహుబలి ప్రస్తావన లేదు కదా.. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ఆ లోకేషన్లను టూరిస్ట్ స్పాట్‌గా చేసేశారు. ఇక ప్రసుత్తం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. చివరి టీ20 మ్యాచ్ కోసం హైదరాబాద్‌లో బస చేశాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్గ్ కూడా టీంతోపాటే వచ్చాడు. తాజాగా ఆయన రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించాడు. అక్కడ బాహుబలి సినిమా సెట్టింగ్స్‌ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. భల్లాలదేవుడి భారీ విగ్రహాన్ని నిలిపిన వేదిక ముందు ఇదిగో ఇలా నిల్చుని ఫోటోలకు ఫోజిచ్చాడు. పక్కనే ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమా టైంలో షూటింగ్ నిమిత్తం వేసిన రైల్వే స్టేషన్ సెట్ లోకి వెళ్లి.. అక్కడ ఓ బోగీ వద్ద కొందరు డాన్సర్లతో కలిసి లుంగి డాన్స్ స్టెప్పులేసి సందడి చేశాడు కూడా. -
స్విమ్స్ డైరెక్టర్.. లుంగి డాన్స్!
►టీటీడీ ఆడిటోరియంలో స్టెప్పులు తిరుపతి : టీటీడీకి చెందిన సంస్థలో అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి పాదాల చెంత కొలువై, దేవస్థానం ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో సాక్షాత్తు డైరెక్టర్ తన హోదా మరచి ఓ కార్యక్రమంలో ‘లుంగి డ్యాన్స్’ అనే పాటకు చిందులేయడం వివాదా స్పదమైంది. ఆయన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో, చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల స్విమ్స్ ఉద్యోగుల పిల్లల సంరక్షణ కేంద్రం వార్షికోత్సవాన్ని శ్రీపద్మావతి ఆడిటోరియంలో నిర్వ హించారు. ముఖ్య అతిథిగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థినులతో కలసి స్టెప్పు లేయడం చూసిన వారు ముక్కున వేలేసుకున్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో అసభ్యకరమైన, పాశ్చాత్య సంస్కృతికి చెందిన కార్యక్రమాలకు స్థానం లేదు. ఆ సంస్థ వైన్స్ చాన్స్‌లర్, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారే ఈ విషయాన్ని విస్మరించి, వేదికపై శ్రీవారి విగ్రహం ఎదుటే ఏమాత్రం సంకోచించకుండా స్టెప్పులేశారు. పాలనాపరంగానూ ఆరోపణలు ఎన్ఆర్ఐ అయిన డాక్టర్ రవికుమార్ అధికార పార్టీకి చెందిన వైద్య శాఖ మంత్రికి సన్నిహితుడు. ఏడాది క్రితం డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆరంభంలో కొన్ని పాలనా పరమైన సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ తర్వాత అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలకమైన నిర్ణయాలను సైతం అధికార పార్టీకి చెందిన అధికారులకు అప్పగించడం, తరచూ సెలవులో విదేశాలకు వెళ్లడంతో స్విమ్స్‌లో పాలన అటకెక్కింది. సీనియర్లను కాకుండా తనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తికి ఫర్ఫ్యూజనిస్ట్గా శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పించారు. ఫైనాన్స్ కమిటీ అప్రూవల్, ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి లేకుండానే ఈ నియామకం పట్ల సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 151 జీవో ప్రకారం కనీస వేతనాలు చెల్లించడం లేదు. ఓ మహిళకు కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధి కల్పించి క్వార్టర్స్ కేటాయించడంపై విమర్శ లున్నాయి. దీనిపై స్విమ్స్ డైరెక్టర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
దర్శకుడికి డ్యాన్స్ నేర్పించిన షారూక్
-
ప్రముఖ దర్శకుడికి డ్యాన్స్ నేర్పించిన షారూక్
శాన్ ఫ్రాన్సిస్కో: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్ ఖాన్ ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ తనదైన లుంగీ డ్యాన్స్‌తో మరోసారి హల్ చల్ చేశారు. ఓ అమెరికన్ చిత్రనిర్మాతకు తమ స్టయిల్ డాన్స్ నేర్పించి అక్కుడున్నవారందరినీ అలరించారు. లాస్ ఏంజిల్స్ లో శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ హాజరైన షారుక్ ఖాన్, అమెరికన్ ఫిలిం మేకర్ , 'రష్ అవర్' , ఎక్స్- మెన్' చిత్రాల ప్రసిద్ధ దర్శకుడు బ్రెట్ రాట్నర్ కు 'లుంగీ డాన్స్' నేర్చించారు. ఇండియాలో షారూక్ తో రష్ అవర్ సీక్వెల్ తీయాలని అనుకున్నానని చెప్పిన రాట్నర్ షారూఖ్ తో అడుగులు కలిపి చాలా థ్రిల్ అయిన దృశ్యాలు ఈ వీడియోలు రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను, కింగ్ ఆఫ్ బాలీవుడ్‌తో ఉన్న ఫోటోను రాట్నర్ సోషల్ మీడియాలో్ పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది. 60వ శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏప్రిల్ 5 మొదలైంది. ఏప్రిల్ 19 బుధవారం తో ఈ వేడుకలు ముగియనున్నాయి. బాద్షా నటించిన మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రాన్ని శుక్రవారం ప్రదర్శించారు. కాగా షారూక్‌ఖాన్ –దీపిక పదుకొన్ `చెన్నయ్ ఎక్స్‌ప్రెస్` మూవీలో చేసిన లుంగీ డ్యాన్స్ అప్పట్లో బాగా పాపులర్ అయింది.. లుంగీతో స్టెప్పులేసి షారూక్, దీపిక పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. తాజాగా ఇప్పుడు సుకుమార్ దర్శక్వంతో సినిమాలోనూ చరణ్ సమంత కథానాయకులుగా తెరకెక్కుతున్న ఓ లవ్‌స్టోరిలో కూడా చరణ్ లుంగీ డ్యాన్స్ చేయనున్నాడట. ‘లుంగీ డ్యాన్స్' పాటతో యో యో హానీసింగ్ యావత్ ప్రపంచం మొత్తాన్ని ఊర్రూతలూగించిన సంగతి తెలిసిందే. -
మంత్రి లుంగీ విప్పేసి సినిమా చూపించాడు
మీరట్: మంత్రి పదవిలో ఉన్నతహోదాలో ఉన్నాననే విషయం మరిచిపోయాడు. ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే చిల్లరవేషాలు వేశాడు. మంత్రిగారు ఏకంగా లుంగీ విప్పేసి అసభ్యకరరీతిలో స్టెప్పులేశాడు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేత, ఆ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి మహమ్మద్ ఫారుఖ్ హసన్ చేసిన నిర్వాకమిది. ఈ తతంగాన్ని ఎవరు వీడియో తీశారో తెలియదు కాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి ఒళ్లు మరచిపోయి డాన్స్ చేసినప్పటి ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అయ్యింది. ఇంట్లోనో లేక గెస్ట్ హౌజ్లోనో తెలియదు కాని బనియన్, లుంగీతో ఉన్న మంత్రి హసన్ మాంచి జోష్‌తో స్టెప్పులు ఇరగదీశారు. అక్కడున్న కొందరు చప్పట్లు కొడుతూ మంత్రిని ఎంకరేజ్ చేశారు. డాన్స్ చేస్తూ మధ్యలో సోఫాలో పడిపోయిన మంత్రి.. లేచి లుంగీ విప్పేసి మళ్లీ కట్టుకుని స్టెప్పులేశారు. ఈ వీడియో బయటకురావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మంత్రి గతంలోనూ ఇలా అసభ్యకరరీతిలో డాన్స్ చేసినట్టు స్థానికులు తెలిపారు. మంత్రి హసన్ మాత్రం ఇది తనపై జరిగిన కుట్ర అని చెబుతున్నారు. దీనివెనుక పంచ్లీ ప్రాంతానికి చెందిన కొందరు యువకుల హస్తముందని ఆరోపించారు. వాళ్లు తనను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు డిమాండ్ చేశారని చెప్పారు. -
లుంగీ డ్యాన్స్‌తో దుమ్మురేపిన ధోనీ, ప్రభుదేవా!
మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ.. క్రికెట్ ఆడటంలో ఆయనది ప్రత్యేకమైన ధనాధన్ శైలి. హెలికాప్టర్ షాట్లతో మైదానంలో రెచ్చిపోవడమే కాదు.. లుంగీ కట్టుకొని ప్రభుదేవాతో పోటీపడి స్టెప్పులు కూడా వేయగలనని తాజాగా ఆయన నిరూపించాడు. ఓ మోటార్ బైక్ వాణిజ్య ప్రకటన కోసం ధోనీ దక్షిణ భారతీయులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ యాడ్‌లో దక్షిణాది స్టైల్లో లుంగీ కట్టడే కాదు.. గ్రేట్ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో కలిసి స్టెప్పులు వేశాడు. రజనీకాంత్ గౌరవార్థం 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొన్ చేసిన 'లుంగీ' డ్యాన్స్ సూపర్‌హిట్. ఇప్పుడే అదే స్టైల్లో ధోనీ, ప్రభుదేవా లుంగీ మోకాళ్లపైకి కట్టుకొని డ్యాన్స్ చేశారు. ఒకప్పుడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నేతృత్వం వహించిన ఈ జార్ఖండ్ డైనమేట్ ధోనీ.. దక్షిణాది వారికి సన్నిహితుడే. ఇప్పుడు చెన్నై జట్టు లేకపోవడంతో ధోనీ ఐపీఎల్లో పుణెకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయినప్పటికీ ధోనీకి దక్షిణ భారతంలోనూ భారీ అభిమానులు ఉన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని తెలుగుభాషలో ఈ యాడ్‌ను మోటార్ బైక్ కంపెనీ రూపొందించింది. అనుకున్నట్టుగానే అభిమానులను అలరించేలా ధోనీ, ప్రభుదేవా తమ 'లుంగీ డ్యాన్స్' స్టెప్పులతో దుమ్మురేపారు. -
చిన్నారుల 'లుంగీ డాన్స్' అదుర్స్
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో గురువారం.. బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు లుంగీ కట్టీ మెడలో తువాలు వేసి చెలరేగి పోయారు. కుర్తా పైజామాతో 'బల్లే బల్లే' అంటూ తమదైన శైలిలో చిందులేస్తూ అదరగొట్టారు. కేరళ, ఒరిస్సా, తెలుగు, పంజాబీ, గుజరాతీ సంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించి అందరినీ అలరించారు. ఇక్కడి లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల పట్టభద్రుల దినోత్సవం గురువారం కన్నుల పండువగా జరిగింది. విభిన్న వేషధారణలతో అందరిని అబ్బురపరిచారు. చిన్నారుల ఆటా పాటలు చూసి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. అలాగే యూకేజీ చిన్నారులు పట్టాను తీసుకుని ఆనందంతో గెంతులేశారు. విద్యా సంస్థల చైర్మన్ సదానంద్ విద్యార్థులకు పట్టాలు అందించారు. -
మహేష్ బాబు కూడా లుంగీ డాన్స్ ...
డాన్సుల్లో 'లుంగీ డాన్స్' ప్రస్తుతం ట్రెండ్ సెట్టర్‌గా చెప్పుకోవచ్చు. 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రంతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తెర లేపిన లుంగీ డాన్స్ దేశమంతా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దాంతో ఈ డాన్స్‌కు పిచ్చి క్రేజ్ రావటంతో మన హీరోలూ ఫాలో అవుతున్నారు. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్, ఇద్దరమ్మాయిలు సినిమాలో అమలాపాల్ లుంగీ డాన్స్ చేసి ఆకట్టుకుంటే... తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న 'ఆగడు' చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు కూడా లుంగీ డాన్స్ చేశాడట. ఫిల్మ్ నగర్లో ఈ వార్త ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో మహేష్ బాబు, శ్రుతిహాసన్లపై ఐటం సాంగ్ చిత్రీకరించారు. ఆ పాటలో.. మహేష్ లుంగీ డాన్స్ చేశాడట. లుంగీ డాన్స్ అదిరిపోయే రీతిలో వచ్చిందని టాక్ వస్తోంది. మహేష్ బాబుతో పాటు విలన్ సోనూ సూద్ కూడా చిందులు వేశాడట. ఈ లుంగీ డాన్స్ పాటలో శ్రుతిహాసన్ గొంతు కలిపిందట. గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన పోకిరి చిత్రంలో ఓ పాటలో మహేష్ లుంగీలో కనిపించాడు. ఈ సినిమాకు ఈ పాట హైలెట్ అని చిత్ర యూనిట్ చెప్పటం విశేషం. ఆగడు ఆడియోను మహేష్ బాబు కొడుకు గౌతమ్ పుట్టినరోజుకు విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సంగీత దర్శకత్వం వహిస్తున్న తమన్‌కు ఈ చిత్రం 50వది కావటం విశేషం. మహేష్ బాబు సరసన తొలిసారి మిల్కీ బ్యూటీ తమన్న నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర, గోపీచంద్, రామ్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తెగ పాపులర్ అయిన ‘లుంగీ’ వెనుక ఒక కథ ఉంది. అటు అభిమానుల్నీ... ఇటు విమర్శకుల నోళ్లలోనూ తెగ పాపులర్ అయిన ఈ డాన్స్‌ని రూపొందించింది ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్. షారుఖ్ ఖాన్ - దీపికా పదుకొనె హాట్‌హాట్‌గా డాన్స్ చేసిన ఆ పాట చిత్రీకరణకు సుమారు 30 గంటలు పట్టిందట. -
మనోజ్‌తో సన్నీ లియోన్ లుంగీ డాన్స్
శృంగార చిత్రాల తార సన్నీ లియోన్ ఏం చేసినా సంచలనమే. ఆమె తెలుగులో ఓ సినిమా చేస్తోందనగానే అందరి కళ్లూ అటే వెళ్లాయి. 'కరెంటు తీగ' సినిమాలో మంచు మనోజ్‌తో పాటు సన్నీ లియోన్ కూడా నటిస్తోంది. దాంతో.. అసలు ఆ సినిమాలో సన్నీ ఏం చేయబోతోంది, ఎలాంటి పాటలు పాడుతుంది, ఏయే డాన్సులు చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశను నిరాశ చేయకుండా ఈ సినిమాలో ఆమె మొట్టమొదటిసారిగా 'లుంగీ డాన్స్' చేయబోతోందని తాజాగా వినిపిస్తోంది. ఇంతకుముందు లుంగీడాన్స్ పాటలో షారుక్ ఖాన్, దీపికా పదుకొనే అడుగులు కలిపారు. కరెంటు తీగ సినిమాలో స్కూలు టీచర్ పాత్ర పోషిస్తున్న సన్నీ, ఆ పాత్రకు తగినట్లుగా నిండుగా చీర కట్టుకుని కనిపిస్తుందట. అయితే ప్రేక్షకులను నిరాశపరచకూడదని మంచు మనోజ్‌తో కలిపి ఆమెకు ఓ మాస్ సాంగ్ పెట్టారు. ఈ లుంగీ డాన్స్ పాటకు బృంద నృత్యదర్శకత్వం వహించారు. ఈ పాట షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ కూడా నటిస్తోంది. -
లుంగీడాన్స్ చేయబోతోన్న హన్సిక
-
పంజాబ్ తోటల్లో లుంగీ డాన్స్!
‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో షారుక్ ఖాన్, దీపికా పదుకొనె చేసిన లుంగీ డాన్స్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఆ తర్వాత పలు వేదికల్లో ఈ పాటకు కాలు కదిపారు షారుక్. ఈ లుంగీ డాన్స్‌కి వచ్చిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లో లుంగీ డాన్స్ పాటలను పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం శివకార్తికేయన్, హన్సిక జంటగా తమిళంలో రూపొందుతున్న ‘మాన్ కరాటే’ చిత్రంలో కూడా లుంగీ డాన్స్ ఉంది. ‘కొలవెరి..’ పాట ఫేమ్ అనిరుథ్ స్వరపరచిన ఈ పాటకు బృందా మాస్టర్ నృత్యదర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాటను పంజాబ్‌లోని తోటల్లో చిత్రీకరిస్తున్నారు. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉందట. ఊలు దుస్తులు ధరించినా తట్టుకోలేనంత చలి అన్నమాట. కానీ, ఆ చలిని ఖాతరు చేయకుండా హీరో శివకార్తికేయన్లానే తను కూడా గళ్ల లుంగీ, గళ్ల చొక్కా ధరించి, ఈ మాస్ పాటకు హుషారుగా డాన్స్ చేశారట హన్సిక. ఈ పాటలో ఇద్దరి కెమిస్ట్రీ అదిరిందని దర్శకుడు అంటున్నారు. ఈ లుంగీ డాన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఊహించవచ్చు. -
షారుక్ 'లుంగీ డ్యాన్స్'కు సంజయ్ దత్ తీన్ మార్!
'చెన్నె ఎక్స్ ప్రెస్' చిత్రంలో షారుక్ ఖాన్ చేసిన లుంగీ డ్యాన్స్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ప్రస్తుతం పూణెలోని ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ షారుక్ లుంగీ డ్యాన్స్ కు స్టెప్పులు వేయనున్నాడు. జైలు సిబ్బంది సంక్షేమం కోసం నిధులను సేకరించడానికి ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శనలో సంజయ్ దత్ కూడా పాల్గొననున్నాడు. రెండున్నర గంటలపాటు జరిగే ఈ కార్యక్రమం సెప్టెంబర్ 26 తేదిన జరుగనుంది. ఈ నిధులను ఖైదీల సౌకర్యానికి కూడా వినియోగించనున్నట్టు జైలు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది ఖైదీలు పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. సంజయ్ దత్ చేసే డ్యాన్స్ ఈ కార్యక్రమంలో హైలెట్ గా నిలుస్తుంది అని తెలిపారు. ప్రదర్శనలో మహారాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. ఇటీవల 'చెన్నై ఎక్స్ ప్రెస్' సాధించిన విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంజయ్ దత్ ఆ చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టిని లేఖ ద్వారా ప్రశసించారట! -
చిలిపిగా ‘లుంగీ డ్యాన్స్’ షారుక్ కు రజనీ ప్రశంస
రజనీకాంత్ యూనివర్సల్ అప్పీల్ ఉన్న నటుడు. అందుకే రజనీ దక్షిణాదికే పరిమితం కాలేదు. రజనీ అభిమానుల జాబితాలో సగటు ప్రేక్షకులే కాకుండా, సినీ నటులు కూడా చేరిపోయారు. తాజా రజనీ అభిమానుల జాబితాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కూడా చేరిపోయాడు. తమిళ నేపథ్యంతో తెరకెక్కించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో ‘మూచోంఖో రౌండ్ గుమాకే, అన్నా కే జైసా చష్మా లగాకే, కోకోనట్ మే లస్సీ మిలాకే, ఆ జావో మూడ్ బనాకే.. ఆల్ ద రజనీ ఫ్యాన్స్, డోంట్ మిస్ ద చాన్స్.. లుంగీ డ్యాన్స్ లుంగీ డ్యాన్స్’ అంటూ రజనీపై అభిమానాన్ని షారుక్ చాటుకున్నాడు. రజనీపై చేసిన లుంగీ డ్యాన్స్ పాటను యూట్యూబ్‌లో కుటుంబ సభ్యులతోపాటు రజనీ చూశాడట. వెంటనే ఫోన్ చేసి ’పాట చిత్రీకరణ బాగుంది. చిలిపిగా ఉంది. చాలా స్వీట్‌గా ఉంది’ అంటూ ప్రశంసించారని షారుక్ వెల్లడించాడు. ఈ పాట చిత్రీకరణకు ముందు రజనీ, ఆయన కూతురు సౌందర్యల అనుమతి తీసుకున్న తర్వాతే హానీ సింగ్‌తో పాడించామని షారుక్ తెలిపాడు. అయితే ‘బాలీవుడ్లో మీరు గొప్పస్టార్’, ’నాపై పాటను ఎందుకు చేస్తున్నారు’ అడిగిన తీరు ఆయన గొప్ప తనానికి నిదర్శనమని షారుక్ తెలిపారు. అయితే చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా ద్వారా రజనీ సార్ గొప్ప తనాన్ని ప్రస్తావించడానికి సరియైన సమయం లభించిందనిపించిందని, తలైవా గురించి ప్రస్తావించకపోతే ఈ సినిమాకు అర్ధం ఉండదు అని షారుక్ అన్నాడు.