ప్రముఖ దర్శకుడికి డ్యాన్స్‌ నేర్పించిన షారూక్‌ | Shah Rukh Khan teaches 'Lungi dance' to Brett Ratner | Sakshi
Sakshi News home page

ప్రముఖ దర్శకుడికి డ్యాన్స్‌ నేర్పించిన షారూక్‌

Published Sat, Apr 15 2017 5:59 PM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

ప్రముఖ దర్శకుడికి  డ్యాన్స్‌ నేర్పించిన షారూక్‌

ప్రముఖ దర్శకుడికి డ్యాన్స్‌ నేర్పించిన షారూక్‌

శాన్ ఫ్రాన్సిస్కో: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూక్‌ ఖాన్‌  ఫిలిం ఫెస్టివల్‌ ఈవెంట్‌ తనదైన లుంగీ డ్యాన్స్‌తో మరోసారి హల్‌ చల్‌ చేశారు. ఓ అమెరికన్ చిత్రనిర్మాతకు తమ స్టయిల్‌ డాన్స్‌ నేర్పించి అక్కుడున్నవారందరినీ అలరించారు. లాస్ ఏంజిల్స్ లో శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ హాజరైన షారుక్ ఖాన్,  అమెరికన్‌ ఫిలిం మేకర్‌ , 'రష్ అవర్' , ఎక్స్‌- మెన్' చిత్రాల  ప్రసిద్ధ దర్శకుడు  బ్రెట్ రాట్నర్ కు 'లుంగీ డాన్స్'  నేర్చించారు.   ఇండియాలో షారూక్‌ తో రష్‌ అవర్‌ సీక్వెల్‌ తీయాలని అనుకున్నానని చెప్పిన రాట్నర్‌  షారూఖ్ తో అడుగులు కలిపి చాలా థ్రిల్‌ అయిన దృశ్యాలు ఈ వీడియోలు  రికార్డ్‌ అయ్యాయి.   

దీనికి సంబంధించిన వీడియోను,  కింగ్‌ ఆఫ్‌  బాలీవుడ్తో  ఉన్న ఫోటోను రాట్నర్‌ సోషల్‌ మీడియాలో్ పోస్ట్‌  చేశారు.  దీంతో ఇది  వైరల్‌ అయింది.   60వ  శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏప్రిల్‌ 5 మొదలైంది.   ఏప్రిల్‌ 19 బుధవారం తో ఈ వేడుకలు ముగియనున్నాయి.   బాద్షా నటించిన  మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌    చిత్రాన్ని  శుక్రవారం ప్రదర్శించారు.

కాగా షారూక్‌ఖాన్ –దీపిక ప‌దుకొన్ `చెన్న‌య్ ఎక్స్‌ప్రెస్‌` మూవీలో చేసిన‌ లుంగీ డ్యాన్స్ అప్ప‌ట్లో   బాగా పాపులర్‌ అయింది.. లుంగీతో స్టెప్పులేసి షారూక్‌, దీపిక పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. తాజాగా ఇప్పుడు సుకుమార్‌ దర్శక్వంతో సినిమాలోనూ చ‌ర‌ణ్  స‌మంత కథానాయకులుగా తెరకెక్కుతున్న ఓ ల‌వ్‌స్టోరిలో కూడా చరణ్‌ లుంగీ డ్యాన్స్‌ చేయనున్నాడట. ‘లుంగీ డ్యాన్స్' పాటతో యో యో హానీసింగ్ యావత్ ప్రపంచం మొత్తాన్ని ఊర్రూతలూగించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement