
ind Vs Aus 3rd ODI Chennai- Virat Kohli Dance: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఫీల్డ్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో తన బాడీ లాంగ్వేజ్, హావభావాలు, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ విరాట్ అలరిస్తూ ఉంటాడు. ఇక తాజాగా చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో వన్డే ప్రారంభానికి ముందు కోహ్లి డ్యాన్స్ చేశాడు. బౌండరీ రోప్ వద్ద 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలోని లుంగీ డ్యాన్స్ పాటకు విరాట్ స్టెప్పులు వేశాడు.
ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. తొలి రెండు వన్డేలకు దూరమైన ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. చెన్నై మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా స్పిన్నర్ అగర్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కింది.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా:
డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
చదవండి: IPL 2023: పంజాబ్ కింగ్స్‌కు ఊహించని షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!
— javed ansari (@javedan00643948) March 22, 2023