
'మహానటి' సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తిసురేష్. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కీర్తి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఈ ఏడాది మహేష్ సర్కారు వారి పాట సినిమాతో హిట్టు కొట్టిన కీర్తి సురేష్ ప్రస్తుతం నాని సరసన దసరా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే కీర్తి తాజాగా లుంగీ డ్యాన్స్‌తో నెట్టింట రచ్చ చేసింది. ధూమ్ ధామ్ దోస్తాన్ అనే పాటకు ఫ్రెండ్‌తో కలిసి మాస్ స్టెప్పులేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment