తెలంగాణ యాసకు పట్టం కడుపుతోంది తెలుగు ఇండస్ట్రీ. ఒకప్పుడు విలన్లు, కమెడియన్ల నోటి నుంచి మాత్రమే తెలంగాణ యాసభాష వినిపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలు కూడా ఎట్లైతే గట్లాయే చూస్కుందాం.. అని తెలంగాణ యాసలోనే మాట్లాడుతున్నారు. అలా నాని కూడా దసరాతో చేసిన ప్రయోగం సక్సెసైంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తొలి చిత్రంతోనే మంచి మార్కులు పట్టేశాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ డ్యాన్స్ అయితే ఇప్పటికీ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి డిలీట్ చేసిన ఓ సన్నివేశాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. నిన్నే.. అంత కానిదాన్నైపోయినా.. ఆడెవడో వచ్చి తాళి కడతాంటే ఆపేది పోయి ఇంక మీదకెళ్లి తీస్కపో అని చెప్పి నన్ను వదిలించుకున్నవ్, నువ్వసలు తల్లివేనా? అంటూ కీర్తి సురేశ్ డైలాగ్‌తో వీడియో మొదలైంది. అందరూ కూడా నా బతుకును ఎట్ల చేశిర్రో చూశినవా అని అత్త ముందు ఆవేదన వ్యక్తం చేసింది వెన్నెల.
వెంటనే ఆమె అత్త వెన్నెలను తన అత్తారింటి ముందుకు తీసుకెళ్లి.. 'గిదే నీ ఇల్లు. ఈడ్నే నీ బతుకు.. నా మాట విని లోపలికి పోవే.. నీ బాంచెనే' అంటూ వెన్నెలను బతిమాలుకుని వెళ్లిపోతుంది. మోడువారిన చెట్టులా అక్కడే నిలబడిపోతుంది వెన్నెల. మరోవైపు ఈ సంభాషణంతా అక్కడే గోడ వెనుక ఉన్న ధరణి(నాని) వింటాడు. ఈ వీడియో చూసిన జనాలు ఇది సినిమాలో ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment