Brett Ratner
-
ఆ కీచక డైరెక్టర్‌కు శిక్ష పడాలి!
లాస్ ఏంజిలిస్ : హాలీవుడ్ దర్శకనిర్మాత బ్రెట్ రాట్నర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మహిళా దర్శకురాలు పాటీ జెంకిన్స్ తీవ్రంగా స్పందించారు. రాట్నర్, నటాశా హెన్ స్ట్రింగ్, ఒలివియా మన్ సహా ఆరుగురు నటీమణులపై వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బాధితురాళ్ల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. తన చేతుల మీదుగా ఇటీవల అవార్డు తీసుకున్న డైరెక్టర్ ఇలాంటి నీచ పనులను పాల్పడతాడని ఊహించలేదన్నారు. రాట్నర్ పై ఆరోపణలు విని ఎంతో ఒత్తిడికి లోనయ్యానంటూ ట్విట్టర్ లో ఆమె ఓ లేఖ పోస్ట్ చేశారు. రాట్నర్ ను కలిసినప్పుడు నాకు ఎదురైన అనుభవాలను షేర్ చేసుకున్నాను. అదృష్టవశాత్తూ ఆ సమయాల్లో రాట్నర్ నాతో అసభ్యంగా ప్రవర్తించలేదు. కానీ మహిళలపై అఘాయిత్యానికి ఒడిగట్టిన రాట్నర్ తప్పులను మాత్రం క్షమించేది లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురైన వారికి మనం మద్ధతు తెలపాలన్నారు. అదే సమయంలో కీచక డైరెక్టర్ రాట్నర్ కు శిక్షపడేలా చూడాలని పిలుపునిచ్చారు. నిజాలను నిర్భయంగా భయపటపెట్టిన బాధితురాళ్ల ధైర్యాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నట్లు మహిళా దర్శకురాలు జెంకిన్స్ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇటీవల జేవిష్ నేషనల్ ఫండ్ వారు నిర్వహించిన ఓ ఈవెంట్లో 'వండర్ ఉమన్' దర్శకురాలు జెంకిన్స్ చేతుల మీదుగా ట్రీ ఆఫ్ లైఫ్ అవార్డును రాట్నర్ అందుకున్నారు. తన చేతుల మీదుగా అవార్డ్ తీసుకున్న వ్యక్తి ఇలా వేధింపులకు పాల్పడ్డాడంటే నమ్మశక్యంగా లేదన్నారు పాటీ జెంకిన్స్. -
దర్శకుడికి డ్యాన్స్ నేర్పించిన షారూక్
-
ప్రముఖ దర్శకుడికి డ్యాన్స్ నేర్పించిన షారూక్
శాన్ ఫ్రాన్సిస్కో: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్ ఖాన్ ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ తనదైన లుంగీ డ్యాన్స్‌తో మరోసారి హల్ చల్ చేశారు. ఓ అమెరికన్ చిత్రనిర్మాతకు తమ స్టయిల్ డాన్స్ నేర్పించి అక్కుడున్నవారందరినీ అలరించారు. లాస్ ఏంజిల్స్ లో శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ హాజరైన షారుక్ ఖాన్, అమెరికన్ ఫిలిం మేకర్ , 'రష్ అవర్' , ఎక్స్- మెన్' చిత్రాల ప్రసిద్ధ దర్శకుడు బ్రెట్ రాట్నర్ కు 'లుంగీ డాన్స్' నేర్చించారు. ఇండియాలో షారూక్ తో రష్ అవర్ సీక్వెల్ తీయాలని అనుకున్నానని చెప్పిన రాట్నర్ షారూఖ్ తో అడుగులు కలిపి చాలా థ్రిల్ అయిన దృశ్యాలు ఈ వీడియోలు రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను, కింగ్ ఆఫ్ బాలీవుడ్‌తో ఉన్న ఫోటోను రాట్నర్ సోషల్ మీడియాలో్ పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది. 60వ శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏప్రిల్ 5 మొదలైంది. ఏప్రిల్ 19 బుధవారం తో ఈ వేడుకలు ముగియనున్నాయి. బాద్షా నటించిన మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రాన్ని శుక్రవారం ప్రదర్శించారు. కాగా షారూక్‌ఖాన్ –దీపిక పదుకొన్ `చెన్నయ్ ఎక్స్‌ప్రెస్` మూవీలో చేసిన లుంగీ డ్యాన్స్ అప్పట్లో బాగా పాపులర్ అయింది.. లుంగీతో స్టెప్పులేసి షారూక్, దీపిక పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. తాజాగా ఇప్పుడు సుకుమార్ దర్శక్వంతో సినిమాలోనూ చరణ్ సమంత కథానాయకులుగా తెరకెక్కుతున్న ఓ లవ్‌స్టోరిలో కూడా చరణ్ లుంగీ డ్యాన్స్ చేయనున్నాడట. ‘లుంగీ డ్యాన్స్' పాటతో యో యో హానీసింగ్ యావత్ ప్రపంచం మొత్తాన్ని ఊర్రూతలూగించిన సంగతి తెలిసిందే.