జవాన్‌ ప్రభంజనం: ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ వైరల్‌, ఏమన్నారో తెలుసా? | Bollywood Latest Jawan Movie Records Anand Mahindra Lauds SRK As A Natural Resource - Sakshi
Sakshi News home page

SRKJawan ప్రభంజనం: ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ వైరల్‌, ఏమన్నారో తెలుసా?

Published Fri, Sep 8 2023 1:20 PM | Last Updated on Fri, Sep 8 2023 1:40 PM

Bollywood latest movie Jawan records Anand Mahindra lauds SRK as natural resource - Sakshi

Jawan: బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ లేటెస్ట్‌ మూవీ జవాన్‌ అత్యధిక వసూళ్లతో  సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన  సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి తొలి రోజు ఏకంగా రూ.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు  తెలుస్తోంది. దీనిపై  వ్యాపారవేత్త బిలియనీర్‌, ఆనంద్‌ మహీంద్ర స్పందించారు.దీంతో ఇది వైరల్‌గా మారింది.  (యాపిల్‌కు భారీ షాక్‌: టిమ్‌ కుక్‌కు నిద్ర కరువు)

సాధారణంగా  దేశాలన్నీ తమ సహజ ఖనిజ వనరులను భద్రంగా కాపాడుకుంటాయి. వాటిని మైనింగ్‌ చేసి, విదేశీ మారక ద్రవ్యం కోసం ఎగుమతి చేస్తాయి. ఇపుడిక షారూఖ్‌ ఖాన్‌ను నేచరల్‌ రిసోర్స్‌గా ప్రకటించాల్సిన సమయం బహుశా వచ్చిందనుకుంటా అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్బంగా  దుబాయ్‌లో అభిమానులతో  కింగ్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ సందడి చేస్తున్న ఒక వీడియోను షేర్‌ చేశారు. (హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం: ఖాతాదారులకు బ్యాడ్‌ న్యూస్‌)

దీంతో ట్వీపుల్‌  జవాన్‌ విజయాన్ని  సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ‘ఎస్‌ఆర్‌కే అంటే సారే రికార్డ్స్‌ ఖతం’ అంటూ ఒక యూజర్‌ కమెంట్‌  చేశారు. అలాగే షారూఖ్‌ అంటే నేచురల్‌ రిసోర్స్‌ మాత్రమేకాదు సార్‌,  నేషనల్‌ ప్రౌడ్‌ అంటూ మరొకరు కమెంట్‌ చేశారు. అంతేకాదు ఆ సినిమాలో తూటాల్లా పేలుతున్న కొన్ని డైలాగులను షేర్‌ చేయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement