అర్థరాత్రి షారుక్‌ ఖాన్‌ ఇంటవద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్‌ | Shah Rukh Khan's 58th Birthday Celebrations | Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: అర్థరాత్రి షారుక్‌ ఖాన్‌ ఇంటవద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్‌

Published Thu, Nov 2 2023 9:19 AM | Last Updated on Thu, Nov 2 2023 9:36 AM

Shah Rukh Khan 58th Birthday Celebration - Sakshi

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ అని పలు పేర్లతో తన అభిమానులతో పిలుపంచుకునే నటుడు షారుక్‌ ఖాన్ ఈరోజు తన 58వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న షారుక్‌ ఖాన్‌కు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఖాన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది అభిమానులు ఆయన ఇంటికి వస్తుంటారు. అర్ధరాత్రి 12 దాటగానే  బాణసంచా పేలుస్తూ పండుగలా జరుపుకుంటారు. భారీగా తన అభిమానులు గుమిగూడినప్పటికీ వారిని ఆయన ఏ మాత్రం నిరాశపరచడు.

(ఇదీ చదవండి: వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. మెగా ఫోటో షేర్‌ చేసిన చిరు.. ఎవరెవరు ఉన్నారంటే)

ఇంటి బాల్కనీ వద్దకు చేరుకుని తన మార్క్‌ అభివాదంతో చేతులు ఊపుతూ కృతజ్ఞతలు తెలుపుతాడు. ఈసారి కూడా తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని వెస్ట్ బాంద్రాలోని తన నివాసం 'మన్నత్' సమీపంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాది మంది అభిమానులు అర్ధరాత్రి చేరుకున్నారు. షారుఖ్ ఖాన్ తన ఇంటి బాల్కనీలో కనిపించి అర్థరాత్రి తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా అభిమానులకు చేయి ఊపుతూ ధన్యవాదాలు తెలిపారు. తమ అభిమాన నటుడిని చూసిన అభిమానుల ఆనందం వెలకట్టలేనిదని చెప్పవచ్చు.

ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. గత మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో షారుఖ్ ఖాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించాడు. రొమాంటిక్ పాత్రలను సులువుగా పోషిస్తూ 'కింగ్ ఆఫ్ రొమాన్స్'గా పేరు తెచ్చుకున్నాడు షారుక్. యాక్షన్ సినిమాల్లో దుమ్మురేపుతున్న షారుఖ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. పఠాన్‌,జవాన్‌లతో వరుస హిట్‌ సినిమాలతో దూసుకుపోతున్న కింగ్‌ డిసెంబర్‌లో తన డంకీ మూవీతో ప్రభాస్‌ సలార్‌ను ఢీ కొట్టనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement