షారుక్ ఖాన్ 'జవాన్' మూవీ బాక్సాఫీస్ బాక్సులు బద్దలు కొడుతోంది. రెండు రోజుల్లో రూ.250 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ చేయడం గ్యారంటీ అనిపిస్తుంది. అయితే ఇందులో తండ్రి కొడుకుగా డబుల్ రోల్ లో షారుక్ మెప్పించాడని అందరికీ తెలుసు. కానీ చాలా సీన్స్ లో డూప్ యాక్ట్ చేశాడని మీకు తెలిసుండడదు. ఇంతకీ అతడెవరు? రెమ్యునరేషన్ ఎంతిచ్చారు?
15 ఏళ్లుగా డూప్‌గా
'జవాన్' మాత్రమే కాదు.. గత 15 ఏళ్ల నుంచి షారుక్ కి డూప్ గా నటిస్తున్న వ్యక్తి పేరు ప్రశాంత్ వాల్దె. ఇతడు షారుక్ కి డూప్ గా నటిస్తున్నప్పటికీ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గానూ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'జవాన్' విశేషాలు బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. ఆ రోజే రానా తమ్ముడి వివాహం!)
ఒకేరోజు రెండు గెటప్స్
'జవాన్ సినిమాలో ఓ సీన్ ఉంది. తండ్రిని కొడుకు హగ్ చేసుకునే సన్నివేశం అది. చేసేటప్పుడు షారుక్ కొడుకు గెటప్ వేస్తే... నేను తండ్రి గెటప్ వేశారు. నన్ను కౌగిలించుకునే టైంలో ఆయన క్లోజప్ షాట్స్ తీశారు. తర్వాత నేను కొడుకు గెటప్ వేస్తే... షారుక్ తండ్రి గెటప్ సీన్స్ తీశారు. అంటే ఒకేరోజు మేం ఇద్దరం రెండు వేర్వేరు గెటప్స్ వేయాల్సి వచ్చింది' అని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.
నెలకి అంత సంపాదన
అయితే షారుక్ డూప్ గా నటిస్తున్న ప్రశాంత్.. రోజుకి రూ.30 వేల వరకు తీసుకుంటున్నాడట. అంటే నెలకు దాదాపు రూ.9 లక్షలు సంపాదిస్తున్నాడు. అంటే సినిమా మొత్తంలో ఇతడికి సంబంధించిన సీన్స్ అన్ని పూర్తి చేయడానికి కొన్ని నెలలు పట్టుంటుంది. దీంతో ఓ రూ.30-40 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుని ఉంటాడని అనిపిస్తుంది. ఏదేమైనా డూప్ గా నటిస్తూ కూడా ఇంత సంపాదించొచ్చనే విషయం ఇతడిని చూశాకే అర్థమైంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు టైం ట్రావెల్ మూవీ)
Comments
Please login to add a commentAdd a comment