'డంకీ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకండి'.. షారుక్‌కు నెటిజన్ రిక్వెస్ట్! | Netizen Asks Shah Rukh Khan To Watch Dunki In Theatres In Illegal Way | Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: 'డంకీని స్టేడియాల్లో ప్రదర్శించండి'.. నెటిజన్‌కు షారుక్ రిప్లై అదరహో!

Published Wed, Nov 22 2023 6:42 PM | Last Updated on Wed, Nov 22 2023 7:33 PM

Netizen Asks Shah Rukh Khan To Watch Dunki In Theatres In Illegal Way - Sakshi

ఈ ఏడాది పఠాన్, జవాన్‌ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన బాలీవుడ్ బాద్‌షా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఇటీవలే అట్లీ డైరెక్షన్‌లో వచ్చిన జవాన్‌ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీతోనే లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓకే ఏడాదిలోనే మూడో చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. షారుఖ్ ఖాన్  డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.  ఇటీవలే ఈ చిత్రం నుంచి లుట్ పుట్ గయా అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. 

అయితే తాజాగా షారుక్ ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఆస్క్ ఎస్‌ఆర్కే సెషన్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.  తనదైన శైలిలో వారికి ప్రశ్నలకు బదులిచ్చారు. మొదటి డంకీ అనే పదానికి అర్థమేంటో వివరించారు.  డంకీ అంటే దేశ సరిహద్దుల వెంట అక్రమ ప్రయాణం గురించి వివరించే మార్గమని షారుక్ వివరించారు.

ఓ నెటిజన్‌  సినిమాను థియేటర్లలో చూడటానికి  చట్టవిరుద్ధమైన మార్గం ఏదైనా ఉందా?  అన షారుక్‌ను ప్రశ్నించాడు. దీనిపై స్పందిస్తూ.. నా చిన్నతనంలో సినిమాలు చూసేందుకు థియేటర్ ప్రొజెక్షనిస్ట్‌ను లైన్‌లో పెట్టేవాడిని.. మీరు ఒకసారి ఇలా ప్రయత్నించండి.. వర్కవుట్‌ అవుతుందేమో.. కానీ ఈ విషయం మీకు చెప్పినట్లు ఎవరికీ చెప్పకండి. ఇది చాలా రహస్యం" అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. 

మరో నెటిజన్ కూడా డంకీని థియేటర్‌లో కాకుండా స్టేడియంలో ప్రదర్శించమని ఎస్‌ఆర్కేను కోరారు. దీనికి బాద్‌షా బదులిస్తూ "అవును.. నేను కూడా మా టీమ్‌కి ఈ విషయం చెప్పాను.. కానీ ఎయిర్ కండిషనింగ్ సమస్య. మీరు సినిమా చూసేందుకు పిల్లలు, పెద్దలతో కలిసి వెళ్లాలి. చాలా అసౌకర్యంగా ఉంటుంది..." అంటూ ఫన్నీగా ఇచ్చిపడేశాడు. కాగా.. రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన డంకీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement