Ask Me
-
Preeti: పనిమనిషి కావాలా... ఆస్క్కు చెప్పండి!
సాక్షి, సిటీబ్యూరో: ఏ ఇంట చూసినా ఇంతి పని అంతా ఇంతాకాదు. పొద్దుతో ఆమె పోటీ పడుతోంది. ఉద్యోగ జీవనంలో ఇంటిపని, వంటపనికి అదనంగా ఇప్పుడు ఆమెకు ఆఫీస్ పని తోడైంది. లివింగ్ కాస్ట్, ఇతర ఖర్చులు పెరిగిన పరిస్థితుల్లో భార్యాభర్తలు జాబ్ చేస్తేనే, అనుకున్న లైఫ్‌ను లీడ్ చేయొచ్చని చాలామంది భావిస్తున్నారు. మహిళాసాధికారత పెరిగిన తర్వాత భర్తతోపాటు భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. అదనపు పని, అదనపు ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఆమెకు పనిమనిషి అవసరం చాలా ఏర్పడింది. హైటెక్‌సిటీ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతాల్లో పనిమనుషులకు చాలా డిమాండ్ ఉంది. ఎంతగా అంటే ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఖాళీగా లేము అనేంతగా..! ఇలాంటి సమస్యకు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వినూత్న పరిష్కారం చూపుతున్నారు. ‘ఆస్క్ లో’పేరుతో వాట్సాప్ వేదికగా ఈ ఆలోచనకు రూపం ఇచ్చారు. ఇలా నలుగురికి సాయపడేందుకు ప్రయతి్నస్తున్నారు.పనిమనుషులు, వంటవారు, డ్రైవర్లు కావాలనుకుంటే.. ‘ఆస్క్ లో’వాట్సాప్‌కు మెసేజ్ పెడితే చాలు, మీకు కావాల్సిన పని చిటికెలో అయిపోతుందని చెబుతున్నారు. మీ మెసేజ్ పనిమనుషులు, డ్రైవర్లకు వెళ్తుంది. అది కూడా వాయిస్ రూపంలో తెలుగులో ఆటోమాటిక్‌గా పంపిస్తారు. మీకు కావాల్సిన సమయంలో వాళ్లు ఖాళీగా ఉంటే తాము వస్తామని తిరిగి మెసేజ్ చేస్తారు. అయితే అప్పటివరకే కాకుండా పూర్తిస్థాయిలో కూడా ఏ టైమ్‌కు రావాలో కూడా మాట్లాడుకుని పనికుదుర్చుకోవచ్చు. ఇలా పనిమనుషులు, డ్రైవర్లకు పని దొరకడంతోపాటు అవసరం ఉన్న ఉద్యోగులకు కూడా మేలు జరుగుతోంది. రెండు పారీ్టల నడుమ మధ్యవర్తి లేకుండా నేరుగా వారే మాట్లాడుకునే వీలుంది.మహిళలకు ఉపయోగంగా ఉంటుందని..రాజస్థాన్‌కు చెందిన ప్రీతి 20 ఏళ్ల కింద హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. 10 ఏళ్ల నుంచి సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. నిత్యజీవితంలో ఎదురైన అనుభవాలు ఈ స్టార్టప్ ఏర్పాటు చేసేందుకు దోహదపడ్డాయని ప్రీతి పేర్కొన్నారు. ఎప్పటి నుంచో సామాన్యులకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేదని, అది ఈ వేదిక ఏర్పాటుతో నెరవేరిందని ప్రీతి చెబుతున్నారు. అప్లికేషన్ లేదా వెబ్‌సైట్‌తో సంబంధం లేకుండా ఈ సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొంటున్నారు. పైగా గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారికి అప్లికేషన్స్ వెబ్సైట్ వాడటం రాకపోవచ్చు. అందుకే అలాంటివారికి సులువుగా పనిదొరికే విధంగా ఈ ప్లాట్ఫారం ఉపయోగపడుతుందని వివరించారు.సేవా దృక్పథంతో..సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ సేవలను అందిస్తున్నా. భవిష్యత్తులో సేవలు మరింత మందికి అందించాలని భావిస్తున్నా. ఇప్పుడు నేను నివసిస్తున్న గచ్చిబౌలి ప్రాంతంలో మాత్రమే అందిస్తున్నా. చాలామంది ఈ సేవలను మెచ్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాస్త ఇబ్బంది అయినా వారి ప్రశంసలతో ముందుకు వెళ్లాలనే ఆకాంక్ష పెరుగుతోంది. – ప్రీతి, ఆస్క్ లో, వ్యవస్థాపకురాలు -
'డంకీ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకండి'.. షారుక్‌కు నెటిజన్ రిక్వెస్ట్!
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన బాలీవుడ్ బాద్షా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఇటీవలే అట్లీ డైరెక్షన్లో వచ్చిన జవాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీతోనే లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓకే ఏడాదిలోనే మూడో చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి లుట్ పుట్ గయా అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. అయితే తాజాగా షారుక్ ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఆస్క్ ఎస్ఆర్కే సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనదైన శైలిలో వారికి ప్రశ్నలకు బదులిచ్చారు. మొదటి డంకీ అనే పదానికి అర్థమేంటో వివరించారు. డంకీ అంటే దేశ సరిహద్దుల వెంట అక్రమ ప్రయాణం గురించి వివరించే మార్గమని షారుక్ వివరించారు. ఓ నెటిజన్ సినిమాను థియేటర్లలో చూడటానికి చట్టవిరుద్ధమైన మార్గం ఏదైనా ఉందా? అన షారుక్‌ను ప్రశ్నించాడు. దీనిపై స్పందిస్తూ.. నా చిన్నతనంలో సినిమాలు చూసేందుకు థియేటర్ ప్రొజెక్షనిస్ట్ను లైన్లో పెట్టేవాడిని.. మీరు ఒకసారి ఇలా ప్రయత్నించండి.. వర్కవుట్ అవుతుందేమో.. కానీ ఈ విషయం మీకు చెప్పినట్లు ఎవరికీ చెప్పకండి. ఇది చాలా రహస్యం" అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్ కూడా డంకీని థియేటర్లో కాకుండా స్టేడియంలో ప్రదర్శించమని ఎస్ఆర్కేను కోరారు. దీనికి బాద్షా బదులిస్తూ "అవును.. నేను కూడా మా టీమ్‌కి ఈ విషయం చెప్పాను.. కానీ ఎయిర్ కండిషనింగ్ సమస్య. మీరు సినిమా చూసేందుకు పిల్లలు, పెద్దలతో కలిసి వెళ్లాలి. చాలా అసౌకర్యంగా ఉంటుంది..." అంటూ ఫన్నీగా ఇచ్చిపడేశాడు. కాగా.. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన డంకీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. Dunki is a way of describing an illegal journey across borders. It is pronounced डंकी. It’s pronounced like Funky…Hunky….or yeah Monkey!!! https://t.co/t0Et738SEk — Shah Rukh Khan (@iamsrk) November 22, 2023 Yes I also told the team but the air conditioning is an issue. You have to go with kids and elders for the film…will be uncomfortable…so let’s keep this one in the theatres in the 21st December only. #Dunki https://t.co/vOkGZ2fJzD — Shah Rukh Khan (@iamsrk) November 22, 2023 -
గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ ఫ్రీ టికెట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన షారుక్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన తాజా చిత్రం జవాన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు కింగ్ ఖాన్ షారుక్. ఈ నేపథ్యంలోనే తన అభిమానులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు. అయితే ఈ సెషన్లో ఓ అభిమాని ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. (ఇది చదవండి: ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్!) మీరు నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ టికెట్ ఇప్పించగలరా? అని షారుక్‌ను అభిమాని అడిగాడు. అయితే దీనికి షారుక్ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. 'ఉచితంగా ప్రేమ మాత్రమే దొరుకుతుంది.. టికెట్ కాదు' అంటూ బాద్షా బదులిచ్చాడు. టికెట్ కావాలంటే డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే. ప్రేమ విషయంలో మరి ఇంత చీప్‌గా ఉండకండి. వెళ్లి టికెట్ కొనుక్కోండి. మీ ప్రియురాలిని సినిమాకు తీసుకెళ్లండి.' అంటూ షారుక్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించగా.. దీపికా పదుకొణె ప్రత్యేక కనిపించనుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే జవాన్ ట్రైలర్ విడుదలై నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఈ చిత్రాన్ని గౌరీ ఖాన్ నిర్మించారు. జవాన్ తర్వాత షారుక్ రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్లో డంకీలో నటించనున్నారు. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్!) Free mein pyaar deta hoon bhai….ticket ke toh paise hi lagenge!! Don’t be cheap in romance go and buy the ticket…and take her with u. #Jawan https://t.co/uwGRrZkz9I — Shah Rukh Khan (@iamsrk) September 3, 2023 -
పఠాన్ సినిమా ఫ్లాప్.. నెటిజన్‌కు షారూక్ దిమ్మదిరిగే కౌంటర్..!
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం 'పఠాన్.' జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. భారీస్థాయిలో వసూళ్లు రాబడుతూ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది పఠాన్. వసూళ్లలో ఇప్పటికే కేజీయఫ్ 2, బాహుబలి వంటి పాన్ ఇండియా చిత్రాల రికార్డ్ బ్రేక్ చేసిన తొలి హిందీ చిత్రంగా పఠాన్ నిలిచింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.700 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సందర్భంగా హీరో శనివారం వీకెండ్ కావడంతో షారూక్ ఖాన్ ఎప్పటిలాగే తన ఫ్యాన్స్‌తో ఆస్క్ఎస్ఆర్కే సెషన్ నిర్వహించారు. ట్విటర్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు పలు రకాల ప్రశ్నలతో షారూక్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఇవాళ నాకు జలుబు ఉంది కాబట్టి.. పెళ్లి ప్రతిపాదనలు తీసుకురావద్దని అభిమానులను సరదాగా కోరాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. పఠాన్ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందని.. కానీ సెకండాఫ్ తీవ్ర నిరాశపరిచిందని అడిగారు. దీనికి షారూక్ స్పందిస్తూ.. ' దీనికి చింతించాల్సిన అవసరం లేదు. నీకు ఫస్ట్ హాఫ్ నచ్చింది కదా. అయితే ఈ వీకెండ్ ఓటీటీలో సెకండాఫ్ ఇంకో సినిమా చూసి చూసేయండి.' అంటూ సలహా ఇచ్చారు. మరో అభిమాని ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున మీతో డేట్‌కు వెళ్లాలనుందని అడిగింది. దీనికి షారూక్ ఖాన్ రిప్లై ఇస్తూ..' డేట్ అంటే నాకు చాలా బోరింగ్.. ఆ రోజు ఎవరైనా మీ ఫ్రెండ్‌తో పఠాన్ మూవీకి వెళ్లండి' అంటూ సలహా ఇచ్చారు. అలాగే చాలామంది అభిమానుల ట్వీట్లకు ఆయన ఫన్నీగా రిప్లై ఇచ్చారు. I am boring as a date….take some cool guy and watch #Pathaan in a theatre https://t.co/yCKPFo1QcS — Shah Rukh Khan (@iamsrk) February 4, 2023 Koi baat nahi. Apni apni pasand hoti hai. Pehla half see of #Pathaan second half see some other film on OTT this weekend. https://t.co/Q6hgMVic9f — Shah Rukh Khan (@iamsrk) February 4, 2023 Oh wow, weekend upon us again. Should be working but have a late call….so thought will catch up with some queries. If u have any. Go ahead #AskSRK ( also no marriage proposals today as I have a cold..just saying ha ha ) — Shah Rukh Khan (@iamsrk) February 4, 2023 -
డేట్‌కు ఎప్పుడు వెళదాం? యంగ్ హీరోకు ఫ్యాన్ ప్రపోజల్
యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం హిట్-2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. శైలేస్ కొలను దర్శకత్వంలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజు నుంచే మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం శేష్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది.సీక్వెల్‌పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉండటం, పెద్ద సినిమాలు లేకుండా సోలోగా రిలీజ్ కావడంతో హిట్-2 కలెక్షన్ల పరంగానూ సూపర్ హిట్టయ్యింది. ఇక ఈ సక్సెస్‌లో భాగంగా శేష్ అభిమానులతో ట్విట్టర్లో చిట్‌చాట్ సెషన్ నిర్వహించారు. ఆస్క్‌మి ఎనీథింగ్ అంటూ ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఇందులో భాగంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అయితే ఓ లేడీ ఫ్యాన్ మాత్రం డైరెక్ట్‌గా డేటింగ్ ప్రపోజల్ చేసింది. మనం ఎప్పుడు డేట్‌కు వెళదాం అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ చేయగా అడివి శేష్ స్పందించాడు. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా.. మనం ఇద్దరం కలిసి హిట్ 2 సినిమా చూద్దామా అంటూ ఆన్సర్ ఇచ్చాడు. డేట్‌కి అడగ్గానే ఏమాత్రం తడబాటులేకుండా శేష్ ఇచ్చిన రిప్లై ఆసక్తిగా మారింది. Idhigo occhestunna. Do you want to watch #HIT2 ? 🙃#AskSesh https://t.co/2LCxbtlIAa — Adivi Sesh (@AdiviSesh) December 3, 2022 -
ఎంత ఆస్తి ఉందో లైవ్‌లో చెప్పేసిన నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా నటించకపోయినా సోషల్ మీడియాలో ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటారు. అంతేకాకుండా నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో ధీటుగా బదులిస్తారు. ఇటీవలి కాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆస్క్ మి ఏ క్వశ్చన్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా నాగబాబును ఉద్దేశించి ఓ నెటిజన్..'ఎంత ఆస్తి ఉంది నీకు'? అంటూ ప్రశ్నించాడు. దీంతో అసహనానికి లోనైన నాగబాబు..అతడికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'నన్ను నువ్వు అని సంబోధించావు..రెస్పెక్ట్ తగ్గిపోయింది సో నీ ప్రశ్నకు సమాధానం చెప్పను. మీకు మీకు ఎంత ఆస్తి ఉంది? అని అడిగి ఉంటే, ఎంత ఉందో చెప్పి నా ఆస్తిలో సగం ఇచ్చేవాడిని .. బ్యాడ్ లక్' అంటూ తనదైన స్టైల్లో చురకలంటించారు. ఇక మరో నెటిజన్.. 'సర్ మీరు ఉండే ఇల్లు ఖరీదు రూ. 50 కోట్లు ఉంటుందా' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా 'ముకేష్ అంబానీ ఇంటి కంటే పది రూపాయలు తక్కువ అంతే. మిగిలినదంతా సేమ్ టూ సేమ్' అని వ్యంగ్యంగా బుదలిచ్చారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి : అవి చూస్తారు కానీ ఆ పని మాత్రం చేయరు : నాగబాబు అల్లుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు.. ఏంటో తెలుసా! -
డివిలియర్స్‌పై మనసుపడ్డ షాహిద్ భార్య!
ముంబై: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ తరచూ తన కుటుంబానికి సంబంధించిన విషయలను, ఫొటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆమె ఇన్‌స్టాగ్రమ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెస్షన్లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు మీరా తనదైన శైలి సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో మీ క్రష్ ఎవరని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది. ‘నాకు దక్షిణాఫ్రియా క్రికెటర్ ఏబి డివిలియర్స్ అంటే క్రష్, ఐ లవ్ హిమ్’ అంటూ మీరా సమాధానం ఇచ్చారు. క్షణం ఆలోచించకుండా ఓపెన్‌గా ఆమె చెప్పిన ఈ సమాధానికి నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఇక దీనికి షాహిద్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అదేవిధంగా తన ఇష్టమైన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఏంటని అడిగిన ప్రశ్నకు.. ప్రముఖ కామెడీ షో ‘షిట్స్ క్రీక్’ అంటే ఇష్టమని ఆమె చెప్పారు. కాగా షాహిద్-మీరాలు 2015లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి కూతురు మిష, కొడుకు జైన్లు ఉన్నారు. షాహిద్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగు రీమేక్ ‘జెర్సీ’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్రెగ్నెన్సీ రూమర్లపై స్పందించిన షాహిద్ భార్య రౌడీగా మారిన అభిషేక్.. సీఎం అవుతాడట! ‘అలా నటించడం ఆనందంగా ఉంది’ -
ఆగిపోనున్న ‘ఆస్క్ మీ’
రోడ్డున పడనున్న 4వేల మంది ఉద్యోగులు న్యూఢిల్లీ: ఈ కామర్స్ స్టార్టప్ సంస్థ ‘ఆస్క్ మీ’ మూతపడనుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన 40 కేంద్రాల్లో పని చేస్తున్న నాలుగు వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. ఈ సంస్థ తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటూ లాభాలు కళ్లజూడలేని పరిస్థితుల్లో తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవలే ఓలాకు చెందిన ట్యాక్సీ ఫర్ ష్యూర్, స్నాప్‌డీల్‌కు చెందిన ఎక్స్క్లూజివ్లీ డాట్ కామ్ మూసివేత ప్రకటనలు వెలువడగా... తాజాగా ఆస్క్ మీ సైతం వాటి సరసన చేరిపోయింది. ఆస్క్‌మీ సంస్థ ఆస్క్ మీ డాట్ కామ్, ఆస్క్ మీ బజార్, ఆస్క్ మీ గ్రోసరీ, ఆస్క్ మీ పే, మొబైల్కార్ట్ పోర్టళ్లను నిర్వహిస్తోంది. కార్యకలాపాలను నిలిపివేయండి... ఆస్క్‌మీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ దాని మాతృ సంస్థ గెటిట్ ఇన్ఫోసర్వీసెస్ సీఎఫ్ఓ ఆనంద్ సోన్‌భద్ర ఉన్నతాధికారులకు ఓ మెయిల్ పంపారు. సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరింతగా అప్పుల్లోకి కూరుకుపోకుండా నివారించేందుకు వెంటనే కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. వీలయితే అన్ని కార్యాలయాలు, హబ్‌లను తాత్కాలికంగా మూసివేయాలని సూచించారు. డెలివరీ బోయ్‌లు, దిగువ స్థాయి ఉద్యోగులకు వేతనాలు చెల్లించనందున వారు అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని, వీటిని నివారించడంతోపాటు హబ్‌ల వద్ద ఆస్తులను రక్షించుకోవాలని సూచించారు. కాగా, ఆస్క్ మీలో అధిక శాతం మంది ఉద్యోగులకు జూలై నెల వేతనాలు చెల్లించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే, గత కొన్ని నెలలకు సంబంధించిన రీయింబర్స్మెంట్ బిల్లులు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థకు పలు కేంద్రాలను మూసివేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయినా సంస్థ పోర్టళ్లు ఇప్పటికీ పనిచేస్తున్నా యి. ఆస్క్ మీ మాతృ సంస్థ అయిన గెటిట్ ఇన్ఫోమీడియా (తర్వాత గెటిట్ ఇన్ఫోసర్వీసెస్గా మారిం ది)లో మలేసియాకు చెందిన ఆస్ట్రో ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ లిమిటెడ్ (ఏఈఎన్ఎల్) 2010లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా 99 శాతం వరకు వాటా తీసుకుంది. ఇప్పటి వరకు సుమారు 30 కోట్ల డాలర్ల మేర నిధుల సాయం అందించింది. ఫోరెన్సిక్ ఆడిట్లో నిజాలు తెలుస్తాయి.. ‘ఏఈఎన్ఎల్ పెద్ద ఎత్తున నిధుల సాయం అందించినప్పటికీ దురదృష్టవశాత్తూ గెటిట్ ఇప్పటి వరకు వ్యాపారాన్ని లాభాల్లోకి తీసుకురాలేకపోయింది. ఆస్క్ మీ లాభాల్లోకి రావడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయని, సంస్థ దివాళా (అప్పులు తీర్చలేని స్థితి) తీసినట్టేనని సలహాదారులు నిర్వహించిన స్వతంత్ర సమీక్షలో తేలింది’ అని ఏఈఎన్ఎల్ ప్రకటించింది. గెటిట్ ఖాతా పుస్తకాలను తనిఖీ చేసేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించనున్నట్టు వెల్లడించింది. ఆడి ట్ ఫలితాలను బట్టి చర్యలు తీసుకుంటామని తెలి పింది. ఇతర ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోయినా గెటిట్ వ్యాపారానికి సాధ్యమైనంత సహకారాన్ని అందించామని... ఇకపైనా బాధ్యతాయుతంగా, భారతీయ చట్టాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేసింది. ఆస్ట్రోదే బాధ్యత: గెటిట్ వ్యాపారం దివాళా తీసిందని ఏఈఎన్ఎల్ ఆరోపించడంపై గెటిట్ ప్రతిస్పందించింది. తాము యాజమాన్యం పరంగా వ్యాపార కొనుగోలుకు అవకాశం ఇచ్చినట్టు తెలిపింది. మూసివేత వల్ల అయ్యే వ్యయంపై ఆస్ట్రోకు సమాచారం ఉందని, 2016 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు గెటిట్తో జరిగిన సంప్రదింపుల సమాచారాన్ని విడుదల చేయాలని, అసలైన విషయం బయటకు వస్తుందని కౌంటర్ ఇచ్చింది. ఫోరెన్సిక్ ఆడిట్ కావాలని ఈ దశలో కోరడంపై స్పందిస్తూ... గత రెండేళ్లుగా ఆస్క్‌మీ ఆడిట్ కమిటీలో ఉన్న ముగ్గురు ఆడిటర్లు కూడా ఆస్ట్రో నామినీలేనని, ప్రస్తుత పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. -
మూతపడనున్న ‘ఆస్క్ మీ’
-రోడ్డున పడనున్న 4వేల మంది ఉద్యోగులు న్యూఢిల్లీ ఈ కామర్స్ స్టార్టప్ సంస్థ ఆస్క్ మీ మూతపడనుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన 40 కేంద్రాల్లో పని చేస్తున్న నాలుగు వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. ఈ సంస్థ తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటూ లాభాలు కళ్లజూడలేని పరిస్థితుల్లో తాజా నిర్ణయం వెలువడడం గమనార్హం. ఇటీవలి కాలంలో ఓలా, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన పలు సంస్థల నుంచి లేఆఫ్ ప్రకటనలు వెలువడగా... తాజాగా ఆస్క్ మీ సైతం వాటి సరసన చేరిపోయింది. ఆస్క్‌మీ సంస్థ ఆస్క్ మీ డాట్ కామ్, ఆస్క్ మీ బజార్, ఆస్క్ మీ గ్రోసరీ, ఆస్క్ మీ పే, మెబెల్కార్ట్ పోర్టళ్లను నిర్వహిస్తోంది. ఆస్క్‌మీ బజార్ మాతృ సంస్థ గెటిట్ ఇన్ఫోసర్వీసెస్ సీఎఫ్ఓ ఆనంద్సోన్భద్ర ఉన్నతాధికారులకు పంపిన మెయిల్లో... సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరింతగా నష్టాల్లోకి కూరుకుపోకుండా నివారించేందుకు వెంటనే కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. వీలయితే అన్ని కార్యాలయాలు, హబ్‌లను తాత్కాలికంగా మూసివేయాలని కోరారు. డెలివరీ బోయ్‌లు, దిగువ స్థాయి ఉద్యోగులకు వేతనాలు చెల్లించనందున వారు అవాంఛనీయ ఘటనలకు పాల్పడే ప్రమాదం ఉందని, వీటిని నివారించడంతోపాటు హబ్‌ల వద్ద ఆస్తులను రక్షించుకోవాలని సూచించారు. ఆస్క్ మీలో అధిక శాతం మంది ఉద్యోగులకు జూలై నెల వేతనాలు చెల్లించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే, గత కొన్ని నెలలకు సంబంధించిన రీయింబర్స్ మెంట్ బిల్లులు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి. స్టార్టప్ సంస్థ ఆస్క్ మీలో మలేసియాకు చెందిన ఇన్వెస్టర్ ఆస్ట్రో ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ లిమిటెడ్ (ఏఈఎన్ఎల్)కు మెజారిటీ వాటా ఉంది. గెటిట్ ఖాతా పుస్తకాలను తనిఖీ చేసేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించినట్టు వెల్లడించింది. -
డీల్ విలువ సుమారు రూ. 63 కోట్లు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సంస్థ ఆస్క్‌మి తాజాగా నిత్యావసరాల ఆన్లైన్ షాపింగ్ సంస్థ బెస్ట్ఎట్లోయెస్ట్డాట్కామ్ను కొనుగోలు చేసింది. దీని విలువ 10 మిలియన్ డాలర్లని (సుమారు రూ. 63 కోట్లు) సమాచారం. ఆన్లైన్లో చెల్లింపులు సులభతరంగా మారుతున్న నేపథ్యంలో ఈ-కామర్స్ షాపింగ్ సైట్లలో నిత్యావసరాల కొనుగోళ్లు మరింతగా పెరగగలవని ఆస్క్‌మి గ్రూప్ సీఎంవో మానవ్ సేఠి తెలిపారు. జులై నాటికి నెలకు 10,000 ఆర్డర్లు సాధించగలమని... ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా ఆస్క్‌మి గ్రాసరీ కార్యకలాపాలు విస్తరించగలదని ఆయన చెప్పారు. బెస్ట్ఎట్లోయెస్ట్డాట్కామ్ ప్రస్తుతం 7,000 పైచిలుకు ఉత్పత్తులను విక్రయిస్తోంది.