Adivi Sesh Superb Reply To Fan Who Ask About Date With Him, Deets Inside - Sakshi
Sakshi News home page

Adivi Sesh : అడివి శేష్‌ను డేట్‌కి అడిగిన ఫ్యాన్‌.. హీరో ఆన్సర్‌ అదిరింది

Published Mon, Dec 5 2022 3:42 PM | Last Updated on Mon, Dec 5 2022 5:13 PM

Adivi Sesh Superb Reply To Fan Who Ask About Date With Him - Sakshi

యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రస్తుతం హిట్‌-2 సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. శైలేస్‌ కొలను దర్శకత్వంలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజు నుంచే మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం​ శేష్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ ఓపెనింగ్స్‌ను రాబట్టింది.సీక్వెల్‌పై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండ‌టం, పెద్ద సినిమాలు లేకుండా సోలోగా రిలీజ్‌ కావడంతో హిట్‌-2 కలెక్షన్ల పరంగానూ సూపర్‌ హిట్టయ్యింది.

ఇక ఈ సక్సెస్‌లో భాగంగా శేష్‌ అభిమానులతో ట్విట్టర్‌లో చిట్‌చాట్‌ సెషన్‌ నిర్వహించారు. ఆస్క్‌మి ఎనీథింగ్‌ అంటూ ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఇందులో భాగంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అయితే ఓ లేడీ ఫ్యాన్‌ మాత్రం డైరెక్ట్‌గా డేటింగ్‌ ప్రపోజల్‌ చేసింది. మనం ఎప్పుడు డేట్‌కు వెళదాం అంటూ ఓ ఫ్యాన్‌ ట్వీట్‌ చేయగా అడివి శేష్‌ స్పందించాడు.

ఇదిగో ఇప్పుడే వ‌చ్చేస్తున్నా.. మ‌నం ఇద్ద‌రం క‌లిసి హిట్ 2 సినిమా చూద్దామా అంటూ ఆన్సర్‌ ఇచ్చాడు. డేట్‌కి అడగ్గానే ఏమాత్రం తడబాటులేకుండా శేష్‌ ఇచ్చిన రిప్లై ఆసక్తిగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement