బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన తాజా చిత్రం జవాన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు కింగ్ ఖాన్ షారుక్. ఈ నేపథ్యంలోనే తన అభిమానులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు. అయితే ఈ సెషన్‌లో ఓ అభిమాని ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.
(ఇది చదవండి: ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్!)
మీరు నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ టికెట్ ఇప్పించగలరా? అని షారుక్‌ను అభిమాని అడిగాడు. అయితే దీనికి షారుక్ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. 'ఉచితంగా ప్రేమ మాత్రమే దొరుకుతుంది.. టికెట్ కాదు' అంటూ బాద్‌షా బదులిచ్చాడు. టికెట్ కావాలంటే డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే. ప్రేమ విషయంలో మరి ఇంత చీప్‌గా ఉండకండి. వెళ్లి టికెట్ కొనుక్కోండి. మీ ప్రియురాలిని సినిమాకు తీసుకెళ్లండి.' అంటూ షారుక్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించగా.. దీపికా పదుకొణె ప్రత్యేక కనిపించనుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే జవాన్ ట్రైలర్ విడుదలై నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఈ చిత్రాన్ని గౌరీ ఖాన్ నిర్మించారు. జవాన్ తర్వాత షారుక్ రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్‌లో డంకీలో నటించనున్నారు.
(ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్!)
Free mein pyaar deta hoon bhai….ticket ke toh paise hi lagenge!! Don’t be cheap in romance go and buy the ticket…and take her with u. #Jawan https://t.co/uwGRrZkz9I
— Shah Rukh Khan (@iamsrk) September 3, 2023
Comments
Please login to add a commentAdd a comment