Shahrukh Khan Movie Pathaan Team Announces Offer on Tickets - Sakshi
Sakshi News home page

బ్లాక్ బస్టర్ మూవీ టికెట్లపై క్రేజీ ఆఫర్.. ఆ మూడు రోజులే..!

Published Thu, Mar 2 2023 8:15 PM | Last Updated on Thu, Mar 2 2023 8:36 PM

Sharukh Khan Movie Pathaan Team Announces Offer On Tickets - Sakshi

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, దీపికా పదుకొణె  స్పై యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్'. ఈ ఏడాది జనవరి 25న విడుదలైన ఈ  చిత్రం బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్‌ అబ్రహాం ప్రధాన పాత్రలు పో షించగా, డింపుల్‌ కపాడియా, అశుతోష్‌ రాణా కీ రోల్స్‌ చేశారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో యశ్‌రాజ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించారు. 

తాజాగా ఈ చిత్రబృందం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. సినీ ప్రియుల కోసం యశ్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ  సినిమా టికెట్లపై మూడు రోజుల పాటు బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా పొందవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ ఆఫర్ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో వర్తిస్తుందని పేర్కొంది.

పఠాన్ సెలబ్రేషన్స్ పేరిట ఈ ఆఫర్‌ను ప్రకటించింది చిత్రబృందం. పఠాన్ కోడ్ ఉపయోగించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ మార్చి 3, 4, 5 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది అయితే ఫస్ట్ కమ్- ఫస్ట్ సర్వ్ కింద టికెట్లను కేటాయించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకు పఠాన్ మూవీ చూడని వారు క్రేజీ ఆఫర్‌తో ఎంచక్కా థియేటర్లలో చూసేయొచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement