బంపరాఫర్.. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రూ.99 మాత్రమే | Cinema Lovers Day Ticket Price Discount On May 31st 2024 | Sakshi
Sakshi News home page

Cinema Lovers Day: తెలుగు ప్రేక్షకులంటే ఇంత చిన్నచూపా?

Published Wed, May 29 2024 2:30 PM | Last Updated on Wed, May 29 2024 3:01 PM

Cinema Lovers Day Ticket Price Discount On May 31st 2024

సినిమాలు తెగ చూసేవాళ్లకు ఇది బంపరాఫర్. ఎందుకంటే మే 31న అంటే ఈ శుక్రవారం సినిమా లవర్స్ డే సందర్భంగా మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏ మల్టీఫ్లెక్స్‌లో అయినా సరే రూ.99 మాత్రమే మూవీ చూడొచ్చని ప్రకటించింది. కానీ ఈ ఆఫర్ తెలుగు రాష్ట్రాలకు వర్తించదని చెప్పి చిన్నపాటి షాకిచ్చింది.

ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో 'హనుమాన్', 'గుంటూరు కారం' లాంటి సినిమాలు వచ్చాయి. వీటి వల్ల బాక్సాఫీస్ కళకళాలాడింది. దీని తర్వాత టాలీవుడ్ అనే కాదు దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లో సరైన మూవీస్ రిలీజ్ కాకపోవడం వల్ల థియేటర్లకు వెళ్లి చూడటం గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే మల్టీప్లెక్స్ అసోసియేషన్ టికెట్ రూ.99 అని ఆఫర్ పెట్టింది.

(ఇదీ చదవండి: హీరోయిన్‌ని తోసేసిన బాలకృష్ణ.. అందరిముందు మద్యం తాగుతూ!)

ఆఫర్ చూసి మీరు తెగ ఎగ్జైట్ అయిపోయింటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇది వర్తించదని చెప్పి షాకిచ్చింది. మన దగ్గర సినిమా లవర్స్ డే ఉన్నప్పటికీ.. కొన్ని మల్టీప్లెక్స్‌ల్లో కొన్ని సినిమాలకు మాత్రం టికెట్ ధర రూ.112గా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. వీళ్లకు ఆఫర్ ఇవ్వకపోయినా సరే ఎలానూ చూస్తారులే అనే ధీమానా? లేదా మరేదైనా కారణం ఉందో తెలియదు గానీ.. ఇలా తెలుగు ప్రేక్షకులపై మల్టీప్లెక్స్‌లా చిన్నచూపు ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ ఏడాది జనవరిలోనూ ఇలానే సినిమా లవర్స్ డే అని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫర్ ప్రకటించింది. నాలుగు నెలల తిరక్కుండానే మళ్లీ బంపరాఫర్ అని చెప్పుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే వ్యాపారం తగ్గినా ప్రతిసారీ కావాలనే ఇలా ఆఫర్స్ అని అంటున్నారా అనే సందేహం వస్తోంది.

(ఇదీ చదవండి: నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement