మూవీ లవర్స్‌కు బంపరాఫర్‌.. అయితే ఆ ఒక్క రోజే! | Multiplex Association of India Announce Tickets Offer On National Cinema Day 2024 | Sakshi
Sakshi News home page

National Cinema Day: సినీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. రూ.99 కే మల్టీప్లెక్స్‌ టికెట్!

Published Wed, Sep 18 2024 1:18 PM | Last Updated on Wed, Sep 18 2024 1:34 PM

Multiplex Association of India Announce Tickets Offer On National Cinema Day 2024

మూవీ లవర్స్‌కు ఓ గుడ్‌ న్యూస్‌. తాజాగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ ప్రియులకు అదిరిపోయే వార్త చెప్పింది. ఈనెల 20న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినిమా టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోని మల్టీప్లెక్స్‌లో ఎక్కడైనా సరే రూ.99 రూపాయలకే సినిమా చూడవచ్చని ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4వేలకు పైగా స్క్రీన్స్‌పై ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. ఐమ్యాక్స్‌, 4డీఎక్స్‌, రిక్లైనర్స్‌ వంటి ప్రీమియర్‌ కేటగిరీలకు ఇది వర్తించదని పేర్కొంది.

ఇంకేందుకు ఆలస్యం.. మీకు నచ్చిన సినిమాను కేవలం రూ.99కే మల్టీప్లెక్స్‌ థియేటర్లలో చూసేయండి. అయితే ఈ ఆఫర్ కేవలం పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, మూవీటైమ్‌, డిలైట్‌ మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్‌ ఆ రోజు  అన్ని సినిమాలతో పాటు అన్ని షోలకు వర్తిస్తుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా  వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. కాగా.. ఈ రోజుల్లో థియేటర్లలో ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూడాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ బంపరాఫర్‌ పట్ల సినీ  ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement