దేవర మూవీ క్రేజ్‌.. రిలీజ్‌కు ముందే రికార్డులు! | Jr NTR Devara Part 1 Creates Another Milestone Record In Overseas | Sakshi
Sakshi News home page

Devara Part 1: జూనియర్ ఎన్టీఆర్ దేవర.. ఓవర్‌సీస్‌లో మరో క్రేజీ రికార్డ్‌!

Sep 15 2024 8:39 AM | Updated on Sep 15 2024 3:13 PM

Jr NTR Devara Part 1 Creates Another Milestone Record In Overseas

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దేవర టీమ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఓవర్‌సీస్‌లో టికెట్స్‌ బుకింగ్స్‌ కూడా ప్రారంభమయ్యాయి.

రిలీజ్‌కు ఇంకా 13 రోజులు ఉండగానే ప్రీ బుకింగ్స్‌లో దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.  యూఎస్‌లో ప్రీమియర్‌ ప్రీసేల్స్‌లో దేవర మరో మైలురాయిని చేరుకుంది. దాదాపు 40 వేలకు పైగా టికెట్స్‌ బుకింగ్స్‌ అయినట్లు దేవర టీమ్ ట్వీట్‌ చేసింది. రెండువారాల ముందే ఈ స్థాయిలో టికెట్స్  ప్రీసేల్స్‌తో దేవర దూసుకెళ్తోంది. యూఎస్‌లో సెప్టెంబర్‌ 26 తేదీనే దేవర ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.

(ఇది చదవండి: నిడివి గురించి అడిగిన సందీప్‌ రెడ్డి.. దేవర టీమ్‌ కౌంటర్‌)

ఇప్పటికే అ‍మెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్‌లోనూ దేవర మానియా కొనసాగుతోంది. ఈ దేశాల్లోనూ రికార్డ్‌ స్థాయిలో ప్రీ బుకింగ్స్‌ జరుగుతున్నాయి. కాగా.. అనిరుధ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement