
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించడానికి దేవర సిద్ధమైంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. దేవర మొదటి పార్ట్ ఈ నెల 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
యానిమల్ డైరెక్టర్‌తో దేవర టీమ్ చిట్‌చాట్
ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో దేవర పవర్ చూపించేందుకు టీమ్ తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలో యానిమల్ మూవీతో సెన్సేషన్‌గా మారిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దేవర టీమ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వదిలారు.
(చదవండి: దేవర రికార్డ్)
నిడివి ఎంత?
ఈ సినిమా ఎలా ఉండబోతోంది? క్యారెక్టర్లు ఏంటి? నిడివి ఎంత? అని సందీప్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించాడు. వాటన్నింటికీ తారక్, కొరటాల తెలివిగా ఆన్సర్స్ ఇచ్చారు. దేవర నిడివి గురించి వంగా అడగడంతో.. ఏంటి? ఈ ప్రశ్న నువ్వు అడుగుతున్నావా? అని కొరటాల కౌంటర్ ఇచ్చాడు. దీంతో తారక్ మధ్యలో కలగజేసుకుంటూ యానిమల్ రన్‌టైమ్ ఎంత? అని ప్రశ్నించాడు. అందుకు సందీప్ రెడ్డి 3 గంటల 24 నిమిషాలు అని బదులిచ్చాడు.
25 రోజులపాటు అండర్ వాటర్ సీన్స్..
తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 25 రోజులపాటు అండర్ వాటర్ సీన్స్ షూటింగ్ చేశాం. ఈ యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని తెలిపాడు. జాన్వీ కపూర్ పాత్ర రాయడమే చాలా కష్టంగా అనిపించిందని కొరటాల పేర్కొన్నాడు. ఇక జాన్వీ మాట్లాడుతూ.. దేవర కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని జోస్యం పలికింది. ఇకపోతే దేవర రన్‌టైమ్ 2 గంటల 58 నిమిషాలు.
Words as wild as the storm….
Here’s the promo! 💥#Devara #DevaraOnSep27th pic.twitter.com/YHPNyCokDq— Devara (@DevaraMovie) September 14, 2024
చదవండి: హీరో ఇంట్లో పనిమనిషిగా మంత్రి కూతురు.. ఏకంగా 20 రోజులు
Comments
Please login to add a commentAdd a comment